అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద కేంద్రం అభివృద్ధి చేయబోతోంది. తెలంగాణ నుంచి 21 స్టేషన్లు తొలి దశకు ఎంపికయ్యాయి. వీటి అభివృద్ధికోసం రూ.894.09 కోట్లు ఖర్చు చేస్తారు.
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ప్రధాని మోదీ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. 27 రాష్ట్రాల్లో మొత్తం 508 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లు, గేమింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తారు. పారిశుధ్య నిర్వహణతోపాటు అన్నిరకాల హంగులద్దుతారు. స్టేషన్లో ప్లాట్ ఫామ్ ల పొడవు పెంచుతారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. స్టేషన్ రెెండు ప్రాంతాలను విడదీసేలా ఉంటే స్కైవాక్ లు ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక హంగులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు.
PM Shri @narendramodi lays foundation stone for redevelopment of 508 railway stations in 27 states and UTs.#AmritBharatStations https://t.co/IkSu5xn4Jy
— BJP (@BJP4India) August 6, 2023
తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద కేంద్రం అభివృద్ధి చేయబోతోంది. ఇందులో తెలంగాణ నుంచి 21 స్టేషన్లు తొలి దశకు ఎంపికయ్యాయి. వీటి అభివృద్ధికోసం రూ.894.09 కోట్లు ఖర్చు చేస్తారు. ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, నాంపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మలక్ పేట, మల్కాజ్ గిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, యాదాద్రి, జహీరాబాద్ రైల్వే స్టేషన్లను తొలిదశలో ఎంపిక చేశారు.
ఇక ఏపీలో 453.50 కోట్లతో 18 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. ఏపీలోని పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ పథకంలో భాగంగా తమ రూపు రేఖలు మార్చుకోబోతున్నాయి.