అమిత్ షా పూజారా ? హోం మంత్రా? - ప్రశ్నించిన మల్లికార్జున ఖర్గే
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో, 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ప్రకటనను ఎందుకు చేశారని ప్రశ్నించారు. హోంమంత్రిగా దేశ భద్రతను, దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన మీకు ఆలయాలకు సంబంధించిన ప్రకటనలుఎందుకని ప్రశ్నించారు.

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ 2024 జనవరి 1 వ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభమవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అక్కడితో ఆగలేదు. రామాలయం ఇంత ఆలస్యమవడానికి కాంగ్రెస్ , సీపిఎం లే కారణమని ఆరోపించారు కూడా. అయితే అమిత్ షా మాటల పట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
ఈ విషయాన్ని ఏ హోదాతో అమిత్ షా ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. మీరు (అమిత్ షా) పూజారి కాదు, రామ మందిరానికి సంబంధించిన మహంత్ కూడా కాదు ఈ దేశానికి హోంమంత్రి అనేది మర్చిపోతున్నారు అని ఎద్దేవా చేశారు ఖర్గే.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో, 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ప్రకటనను ఎందుకు చేశారని ప్రశ్నించారు. హోంమంత్రిగా దేశ భద్రతను, దేశంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన మీకు ఆలయాలకు సంబంధించిన ప్రకటనలుఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.