అధికార మత్తులో అమిత్ షా.. గుజరాత్ అల్లర్ల వ్యాఖ్యలపై ఓవైసీ ధ్వజం
అధికారం శాశ్వతం కాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అమిత్ షా కు గుర్తు చేశారు. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల తరపున ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. "అధికారంలోకి వచ్చిన తర్వాత, అది శాశ్వతం కాదనే విషయాన్ని కొందరు మర్చిపోతున్నారంటూ" పరోక్షంగా షాను ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా అధికార మత్తులో జోగుతున్నారని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. 2002లో గుజరాత్‌లో అల్లరిమూకలకు బీజేపీ తగిన గుణపాఠం చెప్పిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అధికార మత్తులో మాట్లాడుతున్నారంటూ ఓవైసీ శనివారంనాడు ట్వీట్ చేశారు.
అధికారం శాశ్వతం కాదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అమిత్ షా కు గుర్తు చేశారు. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల తరపున ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. "అధికారంలోకి వచ్చిన తర్వాత, అది శాశ్వతం కాదనే విషయాన్ని కొందరు మర్చిపోతున్నారంటూ" పరోక్షంగా షాను ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
" బిల్కిస్ బానో రేపిస్టులకు విముక్తి కలిగించడమే మీరు నేర్పిన పాఠం అని నేను హోం మంత్రికి చెప్పాలనుకుంటున్నాను. బిల్కిస్ మూడేళ్ల కుమార్తె హంతకులను విడిపించి మీరు గొప్ప పాఠం నేర్పించారు.. జాఫ్రీని చంపడం ద్వారా మీరు పాఠం నేర్పారు.. మీరు గుల్బర్గ్ సొసైటీ పాఠం నేర్పారు, మీరు బెస్ట్ బేకరీ పాఠాలు నేర్పించారు.. మీ పాఠాలు మేము గుర్తుంచుకుంటాము" అని ఒవైసీ ఎద్దేవా చేశారు. 'అమిత్ షా సాహబ్, ఢిల్లీ మతకలహాల సమయంలో మీరు ఏం పాఠం చెప్పారు' అని ఆయన ప్రశ్నించారు.