Telugu Global
National

అంబేద్కర్ భారతదేశపు "తొలి పురుష స్త్రీవాది" : శశి థరూర్

80-90 సంవత్సరాల క్రితమే అంబేద్క‌ర్ గొప్ప స్త్రీవాద ఆలోచనలు చేశార‌ని కాంగ్రెస్ ఎంపి శ‌శిథ‌రూర్ అన్నారు. అయితే ఇప్ప‌టికీ అంబేద్క‌ర్ అంటే కేవ‌లం ఒక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడ‌నే అభిప్రాయం అక్క‌డ‌డ‌క్క‌డా క‌న‌బ‌డుతుంద‌ని అన్నారు.

అంబేద్కర్ భారతదేశపు తొలి పురుష స్త్రీవాది : శశి థరూర్
X

భారతదేశంలో స్త్రీ వాదం వినిపించిన మొట్టమొదటి పురుష స్త్రీవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అటువంటి ఆలోచనలను దశాబ్దాల క్రితమే ప్రచారం చేశారని, తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపి శ‌శిథ‌రూర్ అన్నారు. ఇది ప్రస్తుత తరం రాజకీయ నాయకులకు కూడా ప్రగతిశీలమైనదిగా నిలుస్తోంద‌ని ఆయ‌న అన్నారు. శనివారం నాడు గోవా హెరిటేజ్ ఫెస్టివల్‌లో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన తాజా పుస్తకం "అంబేద్కర్: ఎ లైఫ్" గురించి మాట్లాడుతూ అంబేద్క‌ర్ ఉద్యమం, ఆలోచ‌న‌ల గురించి వివ‌రించారు.

1920,30,40 ద‌శ‌కాల్లో అంబేద్క‌ర్ మ‌హిళా చైత‌న్యం కోసం ఎంతో పాటుప‌డ్డార‌ని చెప్పారు. మ‌హిళ‌లు తొంద‌ర‌ప‌డి పెళ్ళిళ్లు చేసుకోవ‌డం ,పిల్ల‌ల్ని క‌న‌డం వంటి వాటిని వ్వ‌తిరేకించార‌ని అన్నారు. బ‌ల‌వంతంగా చేసే పెళ్ళిళ్ళ‌ను అంగీక‌రించ‌వ‌ద్ద‌ని సూచించార‌ని, త‌న భ‌ర్త‌ల‌తో స‌మానంగా అన్ని రంగాల్లో నిలిచి వారికి అండ‌దండ‌లు అందించాల‌ని ఉద్బోధించార‌ని ధ‌రూర్ అన్నారు.

అంబేద్కర్ మహిళా కార్మికులు, కార్మికుల కోసం శాసనక‌ర్త‌గా పోరాడారు, "80-90 సంవత్సరాల క్రితమే అంబేద్క‌ర్ గొప్ప స్త్రీవాద ఆలోచనలు చేశార‌ని " అని ఆయన అన్నారు. "అంబేద్కర్‌ను దళిత నాయకుడిగా చూసే ధోరణి ఉండింది. తన 20 ఏళ్ళ ప్రాయంలోనే అతను ప్రభావవంతమైన ఆలోచ‌న‌ల‌ను బ‌లంగా వినిపించిన‌ ప్రభావశీలిగా మారాడు" అని థ‌రూర్ చెప్పారు. అయితే ఇప్ప‌టికీ అంబేద్క‌ర్ అంటే కేవ‌లం ఒక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడ‌నే అభిప్రాయం అక్క‌డ‌డ‌క్క‌డా క‌న‌బ‌డుతుంద‌ని అన్నారు. ఆయ‌న మాన‌వ‌తావాది సార్వ‌జ‌నీన వ్య‌క్తిత్వం గ‌ల‌వాడ‌ని ధ‌రూర్ కొనియాడేరు.

ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రతిష్టపై అడిగిన ప్రశ్నకు థరూర్ స్పందిస్తూ, 1975లో అమెరికాలో దేశ ప్రతిష్ట భయంకరంగా ఉండేదని అన్నారు. అయితే ఆ త‌ర్వాత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రివ‌ర్త‌న జ‌రిగింద‌ని చెప్పారు.

సహస్రాబ్ది నాటికి, భారత దేశంలో సాఫ్ట్‌వేర్ విప్లవం రావ‌డంతో భారతీయులను కంప్యూటర్ గిగ్‌లుగా ఊహించడం ప్రారంభించారు, "అని చెప్పాడు. 'వై2కె' భారతీయ కంప్యూటర్ నిపుణులకు ఒక మలుపు అని శశి థరూర్ అన్నారు. "కంప్యూటర్లన్నీ క్రాష్ అవుతాయనే భయం ఉండేది.. అకస్మాత్తుగా ఆ సమస్యను అధిగమించడానికి భారతీయులు చేసే కోడ్‌ల కోసం డిమాండ్ పెరిగింది. దాంతోనే భారతదేశం లో నిజ‌మైన సాఫ్ట్‌వేర్ విప్లవం ప్రారంభమైంది" అని థ‌రూర్ అన్నారు.

First Published:  19 Nov 2022 9:18 PM IST
Next Story