జులై-1నుంచి అమర్ నాథ్ యాత్ర.. ఈసారి భారీ భద్రత
యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
అమర్ నాథ్ యాత్ర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యాత్రికుల భద్రత గురించి చర్చించారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
श्री अमरनाथ जी यात्रा की तैयारियों की समीक्षा की।
— Amit Shah (@AmitShah) June 9, 2023
तीर्थयात्रियों की सुरक्षा और उन्हें सुगम दर्शन हो यह हमारी प्राथमिकता है। इसके लिए सरकार अनेक कदम उठा रही है। अधिकारियों को ठहरने की उचित व्यवस्था, दवाइयाँ, ऑक्सीजन सिलिंडर सहित सभी आवश्यक सुविधाओं की पर्याप्त व्यवस्था करने के… pic.twitter.com/IDDFMb1N40
జులై-1నుంచి ఆగస్ట్-31వరకు యాత్ర..
అమర్ నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. గతేడాది ఆకస్మిక వరదల కారణంగా 16మంది యాత్రికులు చనిపోయారు. దీంతో సందర్శకుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.45 లక్షల మంది అమర్ నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా.
మంచు తొలగించే ప్రయత్నాలు..
అమర్ నాథ్ కు వెళ్లే బట్కల్, పహల్ గావ్ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దాన్ని తొలగించే పనులు మొదలు పెట్టింది. జూన్ 15 నాటికి మంచును పూర్తిగా తొలగిస్తారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు వీలుగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లను కూడా సిద్ధం చేశారు.