Telugu Global
National

ఈ రోజు ఢిల్లీలో కవిత దీక్ష ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అవనుందా ?

ఈ నిరసన ప్రతిపక్ష పార్టీల ఏకీకరణకు వేదికగా భావిస్తున్నారు. BRS, నేషనల్ కాన్ఫరెన్స్, PDP, అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (U), RJD, సమాజ్‌వాదీ పార్టీ, CPI, CPM, DMK, NCP, శివ సేన, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా కు చెందిన నాయకులు, పలు సంఘాల నేతలు కవిత దీక్షకు హాజరుకానున్నారు.

ఈ రోజు ఢిల్లీలో కవిత దీక్ష ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అవనుందా ?
X

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక రోజంతా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ దీక్షలో 29 రాష్ట్రాలకు చెందిన 18 రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, పౌర సంస్థల నుంచి దాదాపు 5,000 మంది పాల్గొంటారు.

ఈ నిరసన ప్రతిపక్ష పార్టీల ఏకీకరణకు వేదికగా భావిస్తున్నారు. BRS, నేషనల్ కాన్ఫరెన్స్, PDP, అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (U), RJD, సమాజ్‌వాదీ పార్టీ, CPI, CPM, DMK, NCP, శివ సేన, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా కు చెందిన నాయకులు, పలు సంఘాల నేతలు కవిత దీక్షకు హాజరుకానున్నారు.

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు సత్యవతి రాథోడ్, పీ సబితా ఇంద్రారెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.

చాలా రోజుల తర్వాత 18 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఒకే వేదికమీదికి రానుండటం రాజకీయంగా ఆసక్తి గొలిపే అంశమే. బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెసేతర పార్టీలు ఏకమవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఈ రోజు కార్యక్రమంతో ఊపందుకోనున్నాయని బీఆరెస్ నేతలు భావిస్తున్నారు.

కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష చేపట్టడం , ఈ కార్యక్రమానికి 18 విపక్ష పార్టీల నేతలు హాజరుకానుండటంతో , దీన్ని ఎదుర్కోవడానికి బీజేపీ రంగంలోకి దిగింది. ఈ రోజే ఆ పార్టీ కూడా లిక్కర్ స్కాం కు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి అదే స్థలం కావాలని పట్టుబట్టడంతో నిన్నంతా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ధర్నాలో దాదాపు 5 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని, ముందస్తుగా అన్ని అనుమతులు పొందామని కవితతో పాటు భారత్ జాగృతి నిర్వాహకులు వాదించారు.

చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి దగ్గరలో ధర్నాకు స్థలం ఇస్తామని పోలీసులు చెప్పడంతో బీజేపీ అంగీకరించింది.

First Published:  10 March 2023 9:05 AM IST
Next Story