Telugu Global
National

పీఎఫ్ఐనే కాదు ఆరెస్సెస్ నూ నిషేధించాలి... లాలూ ప్రసాద్ యాదవ్

ఆరెస్సెస్ ను నిషేధించాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. PFI తో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి అన్ని సంస్థలను నిషేధించి, అన్నింటి మీద విచారణ జరపాలి అని ఆయన అన్నారు.

పీఎఫ్ఐనే కాదు ఆరెస్సెస్ నూ నిషేధించాలి... లాలూ ప్రసాద్ యాదవ్
X

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆరెస్సెస్ ను కూడా నిషేధించాలని ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు.

"PFI మీద దర్యాప్తు చేయడం మంచిదే, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి అన్ని సంస్థలను నిషేధించి, అన్నింటి మీద విచారణ జరపాలి'' లాలూ ప్రసాద్‌ అన్నారు.

ప్రభుత్వం ముస్లిం సంస్థలను టార్గెట్ చేస్తోందని ఆయన‌ ఆరోపించారు.

"మొదట, ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి, అది PFI కంటే దారుణమైన సంస్థ. "అని లాలూ అన్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో పరిస్థితి అధ్వానంగా మారిందని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు లాలూ.

"మతోన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని కూలదోయాలి'' అని అన్నారు.

కాగా RJD కూటమి భాగస్వామి, JD (U) కూడా కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రశ్నించింది.ఆ పార్టీ నాయకుడు గులాం రసూల్ బాల్యవి మాట్లాడుతూ, "ఈ రోజు దేశంలో, ఒక పార్టీ మాత్రమే విధేయత సర్టిఫికేట్ ఇస్తోంది. ప్రజలందరిపై ద్రోహులుగా ముద్ర వేస్తోంది అని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికైనా తెలుసా అని ఆయన ప్రశ్నించారు.

First Published:  28 Sept 2022 4:20 PM IST
Next Story