Telugu Global
National

ప్రవేటీకరణకన్నా ముందే ఎయిరిండియా బావుండేది... మోడీ సలహాదారు సంచలన వ్యాఖ్యలు

“ఇది ప్రైవేటీకరణకు ముందు రోజుల కంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఎవరూ బాధ్యత వహించేవారు కనిపించడం లేదు. 15 నిమిషాలకోసారి మారుతున్న కౌంటర్‌లోని సిబ్బంది నిరంతరం వారి స్టేట్‌మెంట్‌లు మారుస్తున్నారు." అని దేబ్రోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రవేటీకరణకన్నా ముందే ఎయిరిండియా బావుండేది... మోడీ సలహాదారు సంచలన వ్యాఖ్యలు
X

ఎయిర్ ఇండియా ప్రవేటీకరణకన్నా ముందే బావుండేదని ప్రధాని సలహాదారు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ మండిపడ్డారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ఆయన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 4 గంటలపాటు ఆలస్యమవడంతో అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సేవలపై ఫిర్యాదు చేశారు,

“ఎయిరిండియాతో విసిగిపోయాను. ఢిల్లీకి AI 687లో బుక్ చేసుకున్నాను. బయలుదేరే షెడ్యూల్ సమయం 16.35. ఇప్పుడు 19.00. ఇప్పుటికీ ఆ ఫ్లైట్ గురించి సమాచారం ఇచ్చే నాధుడే లేడు. ప్రైవేటీకరణకు ముందు ఇలా ఉండేది కాదు.'' అని ఆయన అన్నారు.

“ఇది ప్రైవేటీకరణకు ముందు రోజుల కంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఎవరూ బాధ్యత వహించేవారు కనిపించడం లేదు. 15 నిమిషాలకోసారి మారుతున్న కౌంటర్‌లోని సిబ్బంది నిరంతరం వారి స్టేట్‌మెంట్‌లు మారుస్తున్నారు." అని దేబ్రోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కువ విమానాలు ఆర్డర్ చేసినంత మాత్రాన‌ ఆటోమేటిక్‌గా సర్వీస్ మెరుగుపడదని డెబ్రాయి చెప్పారు.

“ముంబై-ఢిల్లీ AI 687 స్వర్గం కాదు నరకం. గేట్ వద్ద నాలుగు గంటల పాటు ఉన్నాను." అని అతను చెప్పాడు.

డెబ్రాయ్ ట్వీట్ కు స్పందిస్తూ, ఎయిర్ ఇండియా ఒక ట్వీట్‌లో, అనివార్య‌ కారణాల వల్ల విమానం ఆలస్యం అయిందని, అది 8పీఎం బయలుదేరుతుందని పేర్కొంది. "ప్రయాణీకులందరికీ సహాయం చేయడానికి మా బృందం ప్రయత్నిస్తోంది". అని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది.

అయితే, మీ టీమ్ ఏ ప్రయాణికులకు సహాయం చేయడం లేదని డెబ్రాయ్ బదులిచ్చారు.

“కోపంతో ఉన్న ప్రయాణీకుల వీడియోను నేను ట్వీట్ చేయాలనుకుంటున్నారా? వారికి సహాయం చేయాలనుకుంటే, ప్రయాణీకులకు కనీసం టీ/కాఫీ అయినా ఇవ్వండి. ఇప్పుటికే 4 గంటలు వేచి ఉన్నాము. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఇఅప్పటికైనా నిజమైన సమాచారం ఇవ్వండి ”అని ట్వీట్ డెబ్రాయ్ చేశాడు.

First Published:  18 Feb 2023 1:51 PM IST
Next Story