Telugu Global
National

హిందువుల పెళ్లిళ్లపై ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులు ఒక్కరినే వివాహం చేసుకుంటారు.. కానీ ముగ్గురితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంటారని ఉత్తర్‌ప్రదేశ్ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందువుల పెళ్లిళ్లపై ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు
X

హిందువుల వివాహాలపై ఉత్తర్‌ప్రదేశ్ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేం ముగ్గురిని పెళ్లి చేసుకున్నా..వారిని గౌరవంగా చూసుకుంటాం.. మీరు ఒక్కరిని పెళ్లి చేసుకొని ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఒక రాజకీయ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మేము రెండు పెళ్లిళ్లు చేసుకున్నా..మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామన్నారు. వారిని బాగా చూసుకుంటామన్నారు. తమ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఉంటాయని చెప్పారు.

హిందువులు అలా కాదని ఆయన అన్నారు. వారు ఒక్కరినే వివాహం చేసుకుంటారు.. కానీ ముగ్గురితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం గురించి కూడా షౌకత్ అలీ మాట్లాడారు. దేశంలో ఎవరేం వేసుకోవాలో రాజ్యాంగం నిర్ణయిస్తుందన్నారు. హిందుత్వం కాదని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసమే బీజేపీ ఇలాంటి అంశాలను లేవనెత్తుతోందని మండిపడ్డారు.

బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీ నేతలు ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని, మిగతా సమయంలో ముస్లింలను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తుంటారని విమర్శించారు. కాగా హిందువుల వివాహాలపై షౌకత్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

First Published:  15 Oct 2022 12:11 PM IST
Next Story