UPSC పరీక్షలో ఫెయిల్ అయిన 'చాట్ జీపీటీ'
నవంబర్ 2022లో ప్రారంభించబడిన ఈ చాట్‌బాట్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇది US మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE), ఇతర MBA పరీక్షలతో సహా USలో అనేక పరీక్షలను కూడా క్లియర్ చేసింది.

ఆర్టిగిషియల్ ఇంటలీజన్స్ (AI) ఆధారిత చాట్‌బాట్ ChatGPT ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమైంది.
నవంబర్ 2022లో ప్రారంభించబడిన ఈ చాట్‌బాట్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇది US మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE), ఇతర MBA పరీక్షలతో సహా USలో అనేక పరీక్షలను కూడా క్లియర్ చేసింది.
దాని ప్రావీణ్యతను టెస్ట్ చేయడానికి, బెంగళూరుకు చెందిన అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్, సివిల్ సర్వీస్ పరీక్షల కు సంబంధించిన భౌగోళికం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, జీవావరణ శాస్త్రం, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాల నుండి ప్రశ్నలను ఇచ్చింది.
మ్యాగజైన్, UPSC ప్రిలిమ్స్ 2022 నుండి ప్రశ్న పేపర్ 1 (సెట్ A) నుండి మొత్తం 100 ప్రశ్నలను ChatGPTని అడిగింది.
"వాటిలో 54 ప్రశ్నలకు మాత్రమే ChatGPT సరైన సమాధానం ఇచ్చింది" అని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తెలిపింది.
ChatGPT పరిజ్ఞానం సెప్టెంబరు 2021కే పరిమితం చేయబడినప్పటికీ, ఎకానమీ, జియోగ్రఫీ సబ్జెక్ట్ ప్రశ్నలకు కూడా ChatGPT తప్పుడు సమాధానాలను ఇచ్చింది.
UPSC పరీక్షలతో పాటు, సింగపూర్‌లోని ఆరవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన పరీక్షలో కూడా ChatGPT ఘోరంగా విఫలమైంది.