ఆదాయపు పన్నుపై కేంద్రం బిగ్ రిలీఫ్
పదేండ్లలో పన్ను వసూళ్లు డబుల్ అయ్యాయన్నారు నిర్మలా సీతారామన్. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు.
ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపు దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల్లోపు ఆదాయం గల వేతన జీవులకు పన్ను మినహాయింపు ఉంటుందని కీలక ప్రకటన చేశారు. అలాగే ఆదాయం పన్ను శ్లాబుల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టంచేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
పదేండ్లలో పన్ను వసూళ్లు డబుల్ అయ్యాయన్నారు నిర్మలా సీతారామన్. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కానీ, అన్నింటినీ సమర్థంగా ఎదుర్కున్నామన్నారు.పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించామన్నారు. పేదల సంక్షేమం, దేశ సంక్షేమం మంత్రంగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ లక్ష్యంతో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామన్నారు నిర్మలా సీతారామన్. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.