Telugu Global
National

రిపబ్లిక్ డే కు ముందు ఢిల్లీ వీధుల్లో వెలసిన ఖాలిస్తాన్ పోస్టర్లు, గోడలపై రాతలు - అప్రమత్తమైన పోలీసులు

గురుముఖి, హిందీ భాషల్లో ‘ఖలిస్తాన్ జిందాబాద్’, ‘రెఫరెండం 2020’ అని రాసిన పోస్టర్లు, రాతలు ఈ రోజు పశ్చిమ ఢిల్లీలోని వికాస్ పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో కనిపించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు, రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.

రిపబ్లిక్ డే కు ముందు ఢిల్లీ  వీధుల్లో వెలసిన ఖాలిస్తాన్ పోస్టర్లు, గోడలపై రాతలు - అప్రమత్తమైన పోలీసులు
X

దేశ రాజధాని ఢిల్లీలో కనీసం 10 ప్రదేశాలలో ఖలిస్తాన్ అనుకూలంగా పోస్ట‌ర్లు, గోడలపై రాతలు కనిపించాయి. అయితే పోలీసులు వాటిని తొలగించారు.

గురుముఖి, హిందీ భాషల్లో ‘ఖలిస్తాన్ జిందాబాద్’, ‘రెఫరెండం 2020’ అని రాసిన పోస్టర్లు, రాతలు ఈ రోజు పశ్చిమ ఢిల్లీలోని వికాస్ పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో కనిపించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు, రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.

ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

“దేశ వ్యతిరేక, ఖలిస్తాన్‌కు సంబంధించిన గ్రాఫిటీలు ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలలో రాత్రిపూట కనిపించాయి. చీకటిగా ఉన్న ప్రదేశాల్లో, నిర్జన, ఖాళీ ప్రదేశాలలో ఇవి కనిపించాయి. ఇది భద్రతకు సంబంధించిన సమస్య కాదు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమన్ నల్వా తెలిపారు. జనవరి 26న ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పీఆర్వో చెప్పారు.

భారతదేశంలో నిషేధించబడిన సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ ) అనే సంస్థ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి ఉండవచ్చని. వార్తల్లో ఉండడానికే ఆ సంస్థ‌ ఇలాంటి వ్యూహాలు పన్నుతుందని ఆ అధికారి ఎత్తి చూపారు. వారికి సహాయం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన‌ తెలిపారు.

మరో వైపు ఢిల్లీ పోలీసు శాఖ ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా అనుమానిత ఉగ్రవాద సంబంధాలపై పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

కాగా గత ఏడాది జూలై 6న, జూన్ 20న రెండు విద్యాసంస్థల గోడలపై “ఖలిస్థాన్ అనుకూల నినాదాలు” రాసినందుకు పాటియాలాకు చెందిన మంజీత్ అనే వ్యక్తిని కర్నాల్ పోలీసులు అరెస్టు చేశారు.

గత ఏడాది మేలో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ఖలిస్తానీ జెండాలను ఉంచినందుకు పంజాబ్ నివాసిని ఒకరిని అరెస్టు చేశారు.

First Published:  20 Jan 2023 11:00 AM IST
Next Story