ఢిల్లీ మహిళ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
Shraddha Walker Murder case in Delhi: ఆఫ్తాబ్ కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన రోజే మరో మహిళను తన ఇంటికి తెచ్చుకుని సరసాలు ఆడినట్లు తేలింది.
శ్రద్ధావాకర్ శరీరం ఫ్రిజ్‌లో ఉంచుకునే మరో మహిళతో సరసాలు
డేటింగ్ యాప్ ద్వారా మహిళలకు దగ్గరైన ఆఫ్తాబ్
తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను మే 15న హత్య చేయడంతోపాటు, ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఆఫ్తాబ్ కేసు దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన రోజే మరో మహిళను తన ఇంటికి తెచ్చుకుని సరసాలు ఆడినట్లు తేలింది. ఒక డేటింగ్ యాప్ ద్వారా ఆఫ్తాబ్ మహిళలను ఆకర్షించేవాడని తెలుస్తోంది. 2019లో అదే డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ ఆకర్షించారని, ఆమెను హత్య చేసి ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాక, మరో మహిళతో డేటింగ్ కోసం ఈ యాప్‌నే వాడారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఈ కేసులో శనివారం ఆఫ్తాబ్ పూనావాలాను అరెస్ట్ చేసిన తర్వాత, పోలీసులు అతనిని మెహ్రౌలీ అడవికి తీసుకెళ్లి పారేసిన శ్రద్ధా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 13 శరీర భాగాలను గుర్తించక, అవన్నీ దాదాపు ఎముకలుగా మారిపోయాయని తెలుస్తోంది.
ఆఫ్తాబ్- శ్రద్ధాలు సహజీవనం చేస్తున్నఛత్తర్‌పూర్ పహాడీ ప్రాంతంలో అద్దెకుంటున్న అపార్టుమెంటు చుట్టుపక్కలవారికే కాదు, ఆ వీధుల్లో చాలామందికి ఆఫ్తాబ్‌ను అరెస్టు చేసేవరకూ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు అనేక ప్రయోగాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ పూనావాలా గొంతుకోసి చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, నెలల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాడని, ఒక్కో రోజు ఒక్కో ముక్క చొప్పున మెహ్రౌలీ అడవిలో పడేశాడని, దీని కోసం అతను జనసంచారం పెద్దగా ఉండని తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారని చెబుతున్నారు.
శ్రద్ధా మృతదేహాన్ని అఫ్తాబ్ బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికారని, చుట్టుపక్కల వారికి ఎలాంటి వాసన రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశాడని తేలింది. దుర్వాసనను కప్పిపుచ్చడానికి అగర్బత్తి, ధూప్, పాట్‌పూర్రీ, రూమ్ ఫ్రెషనర్‌లను ఉపయోగించి చాలాకాలం అనుమానం రాకుండా చూసుకున్నాడు ఆఫ్తాబ్...కానీ సోమవారం భరించలేని వాసనను ఏ ప్రయత్నమూ కాపాడలేకపోయింది.