Telugu Global
National

అదానీ స్కాం: కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల రక్షణ కోసం పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు పేర్కొన్న‌ న్యాయస్థానం,కమిటీ పనితీరును పర్యవేక్షించేందుకు సిట్టింగ్ జడ్జిని నియమించాలనే ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది.రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపి‍ంది.

అదానీ స్కాం: కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
X

అదానీ పై హిండెన్ బర్గ్ నివేదిక, అనంతర పరిణామాలను పరిశీలించేందుకు తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేంద్రం సీల్డ్ కవర్లో సూచించే పేర్లను కమిటీలో చేర్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

"అదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారుల రక్షణ కోసం పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు పేర్కొన్న‌ న్యాయస్థానం,కమిటీ పనితీరును పర్యవేక్షించేందుకు సిట్టింగ్ జడ్జిని నియమించాలనే ప్రతిపాదనను కూడా తోసిపుచ్చింది.రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపి‍ంది.

కమిటీ పట్ల ప్రజలకు విశ్వాస‍ం కలగాలని చెప్పిన ధర్మాసనం ప్రభుత్వం సూచించిన వారితో కమిటీ ఏర్పాటు చేస్తే అది సాధ్యం కాదని పేర్కొంది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతో సహా పిఐఎల్ పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నది.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం, “మేము సీల్డ్ కవర్ సూచనలను అంగీకరించము. పరిశీలన‌ పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాం. ఒకవేళ మేము సీల్డ్ కవర్ నుండి మీ సూచనలను తీసుకుంటే, అది స్వ‌తంత్రంగా ఉంటుందని ప్రజలు అనుకోరు.'' అని న్యాయస్థానం పేర్కొంది.

మదుప‌రుల రక్షణ కోసం మేము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాము. కమిటీ వేస్తాం. కోర్టుపై అందరికీ విశ్వాసం ఉంటుంది' అని ధర్మాసనం పేర్కొంది.

"సిట్టింగ్ (ఎస్‌సి) న్యాయమూర్తులు ఈ అంశాన్ని వింటారు తప్ప‌ వారు కమిటీలో భాగం కాబోరు" అని సిజెఐ అన్నారు.

First Published:  17 Feb 2023 6:55 PM IST
Next Story