Telugu Global
National

అదానీ స్కాం బైట బడిన రెండు రోజులకు లీడింగ్ జాతీయ పత్రిక‌ల్లో అదానీ గ్రూప్ ఫుల్ పేజ్ యాడ్ లు

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియాల‌ ఢిల్లీ ఎడిషన్‌లు అదానీ గ్రూప్ పూర్తి మొదటి పేజీ ఇంగ్లీషు ప్రకటనలను ప్రింట్ చేయగా, మహారాష్ట్ర టైమ్స్ మరాఠీలో అదే పూర్తి పేజీ ప్రకటనను ప్రింట్ చేసింది. ది హిందూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుండి మరొక పూర్తి పేజీ యాడ్ ను కూడా ప్రచురించింది.

అదానీ స్కాం బైట బడిన రెండు రోజులకు లీడింగ్ జాతీయ పత్రిక‌ల్లో అదానీ గ్రూప్ ఫుల్ పేజ్ యాడ్ లు
X

అనేక అక్రమ లావాదేవీలతో అదానీ తన కంపెనీల షేర్ల ధరలు విపరీతంగా పెంచి చూపించాడని, అది వాపే తప్ప, ఆయా వ్యాపార, పారిశ్రామిక సంస్థల నిజమైన బలం కాదని న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు బహిర్గతం చేసిన రెండు రోజుల తర్వాత దేశంలోని ప్రముఖ జాతీయ పత్రికలు అదానీ గ్రూపు విడుదల చేసిన ఫుల్, మొదటి పేజీ ప్రకటనలను ప్రింట్ చేశాయి.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియాల‌ ఢిల్లీ ఎడిషన్‌లు అదానీ గ్రూప్ పూర్తి మొదటి పేజీ ఇంగ్లీషు ప్రకటనలను ప్రింట్ చేయగా, మహారాష్ట్ర టైమ్స్ మరాఠీలో అదే పూర్తి పేజీ ప్రకటనను ప్రింట్ చేసింది. ది హిందూ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుండి మరొక పూర్తి పేజీ యాడ్ ను కూడా ప్రచురించింది.

అదానీ గ్రూపు అద్భుతమైన పని తీరును, ఆయా కంపెనీల షేర్ల విలువ ఎంత పద్దతిగా నిర్దారించినవో వివరణాత్మకంగా చెప్పిన పబ్లిక్ ప్రకటన ఇది.

గత రెండు రోజులలో, అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరలలో భారీ క్షీణతను చవి చూసింది. వారి మార్కెట్ విలువ 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది.

కొద్ది రోజుల వ్యవధిలో ఇంత భారీ క్షీణతను చూసిన ఈ గ్రూపు కోసం, దేశంలోని ప్రధాన వార్తాపత్రికలలో పూర్తి, మొదటి పేజీ ప్రకటనలు రావడం దేనికి సంకేతం ? దాని వ్యాపార పద్దతుల‌పై ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి, ప్రజల సెంటిమెంట్‌ను అదానీ గ్రూపుకు అనుకూలంగా మల్చడానికి ఇదొక PR ఎత్తుగడగా చూడవచ్చు.

అదానీ గ్రూపు ఇలా జాతీయ పత్రికలకు యాడ్స్ ఇవ్వడాన్ని తనను తాను సనర్దించుకునే వ్యవహారంగా చూడవచ్చు. అయితే లక్షల రూపాయల విలువగల ఈ యాడ్స్ ప్రింట్ చేసిన మీడియా అదానీ చేసిన, చేస్తున్న స్కాంలను బైట పెట్టగలదా అనేదే అసలు ప్రశ్న‌

First Published:  28 Jan 2023 7:44 PM IST
Next Story