బాలీవుడ్‌పై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, చెన్నై నగరాలనే తన నివాసంగా భావిస్తానని వివరించారు. దక్షిణాదిలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అక్కడ టాలెంట్‌కి ఆదరణ ఉంటుందని తెలిపారు.
బాలీవుడ్‌పై సినీ నటి కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పరిశ్రమలో నైతిక విలువలు లోపించాయన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఉన్న విలువలు అక్కడ లేవని స్పష్టం చేశారు. ఆమె మాతృభాష హిందీ అయినా.. తాను పుట్టిపెరిగింది ముంబైలోనే అయినా.. అక్కడి పరిశ్రమ తీరుపై ఆమె తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం విశేషం. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాజల్.. ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. `దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్` అనే అంశంపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని బీటౌన్ అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ కాజల్ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..
`దక్షిణాది సినిమాలు వర్సెస్ బాలీవుడ్` అనే అంశంపై స్పందించాలని కాజల్‌ను కోరగా.. ఆమె స్పందించారు. తాను ముంబైలోనే పుట్టానని, తన మాతృభాష హిందీ అని.. బాలీవుడ్ సినిమాలే చూస్తూ పెరిగానని తెలిపారు. బాలీవుడ్‌లోనూ తాను మంచి సినిమాల్లో నటించానని చెప్పారు. అయితే తన కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లో అని వివరించారు. తెలుగు, తమిళ సినిమాల్లోనే తాను ఎక్కువగా నటించానని చెప్పారు. హైదరాబాద్, చెన్నై నగరాలనే తన నివాసంగా భావిస్తానని వివరించారు. దక్షిణాదిలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అక్కడ టాలెంట్‌కి ఆదరణ ఉంటుందని తెలిపారు. టాలెంట్ ఉంటే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారని వివరించారు. దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయని తాను భావిస్తున్నానని కాజల్ స్పష్టం చేశారు. కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.