రణ్వీర్- దీపిక విడిపోతున్నారా? క్లారిటీ ఇదే
కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న రణ్వీర్- దీపిక 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు.
బాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణే త్వరలో విడాకులు తీసుకోనున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా రణ్వీర్ స్పందించాడు. తాను దీపిక త్వరలో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.
కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న రణ్వీర్- దీపిక 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా వీరు పేరు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రణ్వీర్ తన ఇన్‌స్టా ఖాతాలో తమ పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో దీపిక-రణ్వీర్ విడిపోనున్నారని ప్రచారం మొదలైంది.
గతంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీ కపుల్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన తర్వాతే విడాకులు తీసుకున్న నేపథ్యంలో వీరు కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. బాలీవుడ్లో రెండు రోజులుగా రణ్వీర్- దీపికల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ వార్తలపై తాజాగా దీపికా భర్త రణ్వీర్ స్పందించారు.
తాను, దీపిక త్వరలో విడాకులు తీసుకోబోతున్నామని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని వెల్లడించారు. తామిద్దరం సంతోషంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి ఫొటోలు మాత్రమే కాదని.. 2022 - 23 మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫొటోను డిలీట్ చేసినట్లు చెప్పారు. తామిద్దరం విడిపోబోతున్నామని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా రణ్వీర్ ఫ్యాన్స్‌కు సూచించారు.