Telugu Global
National

కవితకు ఆప్ మద్దతు...బీజేపీపై ఆగ్రహం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆ దీక్ష జరిగితే తమ పరువు పోతుందనే భయంతోనే బీజేపీ కవిత ను నిలవరించాలనుకుంటోందని ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్ మండిపడ్డారు.

కవితకు ఆప్ మద్దతు...బీజేపీపై ఆగ్రహం
X


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. కవిత 10వ తేదీన ఢిల్లీలో చేపట్టిన దీక్షకు భయపడే బీజేపీ సర్కార్ ఈ చర్యకు ఒడిగట్టిందని ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్ ఆరోపించారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆ దీక్ష జరిగితే తమ పరువు పోతుందనే భయంతోనే బీజేపీ కవిత ను నిలవరించాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు.

తమను వ్యతిరేకించే వారిపైకి బిజెపి సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతోందని, జాతీయ దర్యాప్తు సంస్థలు బీజేపీకి జేబు సంస్థల్లా తయరయ్యాయని సంజయ్ సింగ్ అన్నారు.

దేశంలో ఏకపార్టీ విధానాన్ని తీసుకరావాలని బీజేపీ భావిస్తోందని, అందుకే విపక్షపార్టీలన్నింటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. దేశంలో విపక్షాలు లేకుండా పార్లమెంట్ లో చట్టం కూడా చేస్తారేమో అని సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి వీధిలో సీబీఐ, ఈడీ ల శాఖలు ఓపెన్ చేయాలని చురకలంటించారు.

First Published:  9 March 2023 11:36 AM IST
Next Story