పంజాబ్‌లో అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీకి ఆప్ సై.. ఇండియా కూటమికి మరో దెబ్బ
పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను తమ పార్టీ ప్రకటిస్తుందని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ప్రతిపక్ష ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న నితీష్ కుమార్ కూటమికి బైబై చెప్పేసి ఏకంగా ఎన్డీయేతో కలిసిపోయారు. తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్‌లో ఒంటరి పోరుకు సై అని చెప్పేశారు.
మొత్తం 13 స్థానాల్లోనూ మేమే
పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను తమ పార్టీ ప్రకటిస్తుందని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తేల్చేసినట్లే. చండీగఢ్‌లో ఉన్న ఒకే ఒక్క స్థానంలో కూడా ఆప్ పోటీ చేస్తుంది అని చెప్పారు.
ఇక మిగిలేదెవరు..?
మొన్న నితీష్, నిన్న మమత, నేడు కేజ్రీవాల్ ఇలా కూటమిలోని కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇక మిగిలింది యూపీ, బిహార్‌ల్లోని పార్టీలే. దీంతో వీరైనా కూటమిలో ఉంటారా, లేక సొంత దారి చూసుకుంటారా అర్థ కాని అయోమయంలో ఇండియా కూటమి కొట్టుమిట్టాడుతోంది.