Telugu Global
National

గుజరాత్ లో కాంగ్రెస్ ను దెబ్బతీయనున్న ఆప్, MIM

మూడు నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడావచ్చింది. మూడు నెలల క్రితం వరకు కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోబోతోందనే పరిస్థితి నెల‌కొని ఉంది. అయితే ఈ మూడు నెలల్లో పరిస్థితులో నిజానికి హటాత్తు మార్పు వచ్చిందని పరిశీలకుల భావన.

గుజరాత్ లో కాంగ్రెస్ ను దెబ్బతీయనున్న ఆప్, MIM
X

గుజరాత్ లో 1998 నుంచి వరసగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ వస్తున్నది. అందులో దాదాపు నరేంద్ర మోడీ 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. అంతకుముందు చాలా బలంగా ఉన్న కాంగ్రెస్ ను పెద్ద ఎత్తున దెబ్బకొట్టగ‌లిగింది బిజెపీ. అయినప్పటికీ కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తోంది. మోడీ హవా నడుస్తోన్నకాలంలో కూడా గుజరాత్ లో కాంగ్రెస్ 38 శాతానికి పైగా ఓట్లు సంపాధించగలిగింది.

రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఓడిపోని స్థానాలు డజను ఉన్నాయి. వీటిలో ఖేద్‌బ్రహ్మ, దరియాపూర్, జమాల్‌పూర్-ఖాడియా, జస్దాన్, బోర్సాద్, మహుధ, వ్యారా, దంతా, కప్రద, వంస్దా, భిలోడా మరియు వడ్గామ్ ఉన్నాయి.

ముఖ్యంగా గిరిజన, మైనారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో , గిరిజన గిరిజనేతర ప్రాంతాలలో కూడా కాంగెస్ ఇప్పటికీ బలంగా ఉంది. .

ముఖ్యంగా ఉత్తర గుజరాత్‌, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ రెండు దసాబ్ధాలుగా గెలుస్తున్న సీట్లలో, జమాల్‌పూర్ ఖాడియా, దరియాపూర్ వంటి ముస్లిం-కేంద్రీకృత స్థానాలు మినహా మిగిలినవన్నీ ప్రధానంగా గ్రామీణ స్థానాలు.

మూడు నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడావచ్చింది. మూడు నెలల క్రితం వరకు కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోబోతోందనే పరిస్థితి నెల‌కొని ఉంది. అయితే ఈ మూడు నెలల్లో పరిస్థితులో నిజానికి హటాత్తు మార్పు వచ్చిందని పరిశీలకుల భావన. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం ఊపందుకున్న తర్వాత పరిస్థితుల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా తన హోదాను నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఆకస్మిక పునరుద్ధరణను ప్రారంభించిందని అనుకోవచ్చు. అయినప్పటికీ ఆ పార్టీ 2017 పనితీరును పునరావృతం చేయగలదా అన్నది ఇప్పటికీ అనుమానమే.

ఈ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితిని అనూహ్యంగా మార్చే అనేక అంశాలు ఉన్నాయి. ఈ అనూహ్యతకు దోహదపడే స్థూలంగా మూడు సానుకూలాంశాలు, మూడు ప్రతికూలతలు ఉన్నాయి.

సానుకూలాంశాలు

కాంగ్రెస్‌కి ఈ 'పునరుజ్జీవనం' గత నెల రోజులలోనే అంత హఠాత్తుగా వచ్చింది కాదు.గత ఎన్నికలలో, ముఖ్యంగా 2007, 2012 ఎన్నికల్లో కూడా, కాంగ్రెస్ చిత్రంలో ఎక్కడా లేనట్లు అనిపించింది కానీ ఆ పార్టీ మంచి ఓట్ షేర్‌ను పొందగలిగింది. ఇప్పటికీ ఆ పార్టీకి మంచి ఓటు షేర్ ఉంది.

కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయింపులు, నాయకత్వ లేమి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజా పునాది, సంస్థాగత పరంగా చెక్కుచెదరని నిర్మాణం కలిగి ఉంది.

ఉదాహరణకు ఈ మూడు అంశాలను తీసుకుందాం.

ఓటు భాగస్వామ్యం

ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీకి అత్యంత ప్రజాదరణ ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ 38 శాతం కంటే ఎక్కువ ఓట్ల వాటాను నిలబెట్టుకుంది. గుజరాత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 30 శాతం ఓట్ల వాటా కంటే తగ్గలేదు.

అయితే, 1998 నుండి జరిగిన ఎన్నికలు చాలావరకు రెండు పార్టీల మధ్య‌ పోటీగానే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. AAP లేదా AIMIM వంటి కొత్త ఆటగాళ్ళ ఆవిర్భావం కాంగ్రెస్‌ను ఎంతవరకు దెబ్బతీస్తుందో చూడాలి.

కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓడిపోని స్థానాల్లో ఆ పార్టీనుంచి బీజేపీలోకి పిరాయింపులతోపాటు AAP, AIMIM, 'భారతీయ గిరిజన పార్టీ'ల ఉనికి కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది.

దళిత ఓటర్లలో కాంగ్రెస్‌కు స్థిరమైన పునాది ఉంది.ఆదివాసీలు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదార్లుగా ఉన్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీల మద్దతు కాంగ్రెస్ కోల్పోయింది. అయిన‌ప్పటికీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన కొన్ని సామాజిక వర్గాల్లో ఇది ఒకటి.

CSDS డేటా ప్రకారం, గుజరాత్ దళితులలో కాంగ్రెస్ మద్దతు వాస్తవానికి 2017 అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికల మధ్య పెరిగింది. అయితే ఇతర సామాజిక వర్గాల్లో ఆ మద్దతు తగ్గింది.

అయితే, గుజరాత్ జనాభాలో దళితులు కేవలం 7 శాతం,ముస్లింలు 10 శాతం కంటే తక్కువగా ఉండటం, సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఆదివాసీలు, OBCలలో బిజెపి ప్రభావం పెరుగుతుండటం కాంగ్రెస్ కు నష్టం చేసే అంశం.

ప్రతికూలతలు

2017లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక‌ వేవ్ లేకపోవడం

బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, అయితే మూడు అతి పెద్ద ఉద్యమాల కారణంగా 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన మద్దతు ఈ ఎన్నికల్లో లేదు. పాటిదార్ అనామత్ ఆందోళన్, కోటాలలో మార్పుకు వ్యతిరేకంగా OBCల నిరసనలు, ఉనాలో దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం 2017 లో కాంగ్రెస్ కు చాలా ఉపయోగపడ్డాయి.

బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా మల్ధారీ సంఘం మహాపంచాయత్ చేసిన ప్రకటన మినహా, ఈసారి కాంగ్రెస్‌కు అలాంటి ఉద్యమాల మద్దతేదీ లేదు.

2017లో, నోట్ల రద్దు,జీఎస్టీల పై ప్రజల ఆగ్రహం కారణంగా కూడా కాంగ్రెస్ లాభపడింది. దీనికి విరుద్ధంగా, COVID-19 మరణాలు, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక నష్టాలు ఈసారి ఎన్నికల సమస్యలుగా మారలేదు.

ప్రతిపక్ష స్థానానికి పోటీదారులు

గత 25 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ‌ పోరు కొనసాగుతోంది. 1980లు, 1990ల ప్రారంభంలో, జనతాదళ్ ఒక ముఖ్యమైన పోటీదారుగా ఉండేది.

ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ఆప్ రూపంలో పుంజుకోనుంది. ఇప్పుడు, ఆప్ ఎంత లాభపడుతుందో అది ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుందో స్పష్టత‌ లేదు. ఆర్గనైజేషన్,వనరుల పరంగా బిజెపికి ఉన్న ఆధిక్యత, ఆప్ చేతిలో ఓట్ల కోత కాంగ్రెస్ మరింత హాని కలిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆ తర్వాత భారతీయ ట్రైబల్ పార్టీ, AIMIM లు ఆదివాసీ, ముస్లిం ఓట్లను ఆకర్షిస్తున్నాయి, ఆ రెండు వర్గాలు కాంగ్రెస్ సంప్రదాయ మద్దతుదారులే, ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లకు పెద్ద ఎత్తున గండికొట్టే అవకాశాలు కనపడుతున్నాయి.

భారతీయ ట్రైబల్ పార్టీ పితామహుడు ఛోటుభాయ్ వాసవా, అతని కుమారుడు మహేష్ వాసవ మధ్య గొడవ కారణంగా BTP దాని స్వంత సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. దీనివల్ల వారి కంచుకోటలైన ఝగాడియా, దేడియాపదాలలో ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురుకావచ్చు కానీ వారు పోటీ చేస్తున్న ఇతర స్థానాల్లో కొంతవరకు కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లవచ్చు.

రాష్ట్రంలో 14 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏఐఎంఐఎం విషయంలోనూ అదే పరిస్థితి ఉంది. జమాల్‌పూర్ ఖాదియా, దరియాపూర్ వంటి ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలు కాంగ్రెస్ కు గట్టి పట్టున్న ప్రాంతాలు అయితే ఇప్పుడు AIMIM కారణంగా ఇవి ప్రమాదంలో పడవచ్చు.

ఫిరాయింపులు

కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి పదేపదే ఫిరాయింపుల వల్ల కూడా కాంగ్రెస్ కు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2017లో ఎన్నికైన 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 14 మంది బీజేపీలోకి ఫిరాయించారు.

ఈసారి కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో తన సొంత మాజీ ఎమ్మెల్యేలపై పోటీ చేస్తోంది. ఇందులో కాంగ్రెస్ కంచుకోటలుగా పరిగణించబడే జస్దాన్, వడ్గామ్ అనే రెండు స్థానాలు కూడా ఉన్నాయి.


మొత్తానికి రాష్ట్రంలో అధికార బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో పోటీపడగల రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ఆ పార్టీలో ఉన్న సమస్యలు, ఆమ్ ఆద్మీ పార్టీ, AIMIM,భారతీయ ట్రైబల్ పార్టీలు చీల్చే ఓట్ల శాతం మీదనే కాంగ్రెస్ భవిష్య‌త్తు ఆధారపడి ఉంది.

First Published:  26 Nov 2022 2:39 AM GMT
Next Story