Telugu Global
National

కేజ్రీవాల్ ప్ర‌ధాని అభ్య‌ర్థి కాదు.. స్ప‌ష్ట‌త ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ

ఇండియా (INDIA) కూట‌మిలో భాగ‌స్వామ్య‌ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. దేశం మొత్తానికి ఓ మోడ‌ల్‌ను అందించార‌ని తెలిపారు.

కేజ్రీవాల్ ప్ర‌ధాని అభ్య‌ర్థి కాదు.. స్ప‌ష్ట‌త ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ
X

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి కాద‌ని, ఆ రేసులో కూడా లేర‌ని ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది. ఢిల్లీ మంత్రి అతిషీ బుధ‌వారం ఈ మేర‌కు స్పందించారు. ఇప్పుడు భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఇండియాతో ఉంద‌ని చెప్పారు. ఎవరో ప్రధాన మంత్రి లేక మంత్రి కావడం కోసం ఆప్ ఈ కూటమిలో భాగం కాలేదని తెలిపారు. దేశ రక్షణ నిమిత్తమే తాము ఇందులో భాగమయ్యామ‌ని చెప్పారు. అరవింద్ కేజ్రివాల్ ప్రధాన మంత్రి అభ్యర్థి కాదు ఈ సంద‌ర్భంగా మంత్రి అతిషీ స్ప‌ష్టం చేశారు. తమ పార్టీ నేత ప్రియాంకా కక్కడ్‌ వెల్లడించిన అభిప్రాయం ఆమె వ్యక్తిగతమని ఈ సంద‌ర్భంగా తేల్చి చెప్పారు.

ఇంత‌కీ ప్రియాంకా క‌క్క‌డ్ ఏమ‌న్నారంటే.. ఇండియా (INDIA) కూట‌మిలో భాగ‌స్వామ్య‌ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. దేశం మొత్తానికి ఓ మోడ‌ల్‌ను అందించార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇండియా (INDIA) కూట‌మికి సార‌థ్యం వ‌హించ‌డంతో పాటు ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ఉండాల‌ని కోరుకుంటున్నామ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్ప‌డిన ఇండియా (INDIA) కూట‌మి తాజాగా మ‌రోసారి భేటీకి సిద్ధ‌మ‌వుతోంది. ఈ త‌రుణంలో ప్రియాంకా క‌క్క‌డ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

*

First Published:  30 Aug 2023 11:54 PM IST
Next Story