Telugu Global
National

రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు.... 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా !

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల వల్ల‌ రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం మొదలైంది. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే తర్వాతి ముఖ్యమంత్రి ఎవర‌న్న దానిపై ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు 82 మంది తమపదవులకు రాజీనామా చేశారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు.... 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా !
X

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామాచేయనున్నారు. ఆయన తర్వాత సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలంతా సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంతో దాదాపు 82 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.

ఈ 82 మంది తమ రాజీనామా లేఖలతో ఓ బస్సులో స్పీకర్ జోషి నివాసానికి వెళ్ళారు. గెహ్లాట్ వర్గానికి చెందిన ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో రాజీనామాలు చేస్తున్నారన్నారు. దాని కోసం స్పీకర్ దగ్గరికి వెళ్తున్నామని, తమను సంప్రదించకుండా సీఎం అశోక్ గెహ్లాట్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యేలు కలత చెందుతున్నారని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేల సూచనలను సీఎం గెహ్లాట్ పట్టించుకోవాలని ఆయన అన్నారు. మా వెంట 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 10-15 మంది ఎమ్మెల్యేల మాటలు వింటూ మెజార్టీ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పార్టీ నాయకులు మా మాట వినకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్నారాయన. ఈ విషయంపై పార్టీ అధ్యక్షురాలిని తామంతా కలుస్తామని ఆయన తెలిపారు.

గెహ్లెట్ రెండు పదవుల్లోనూ కొనసాగాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు.

మరో వైపు ఈ రోజు రాత్రి 7 గంటలకు జరగాల్సిన సీఎల్పీ సమావేశం జరగలేదు. ఆ సమావేశం కోసం ఏఐసీసీ నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, అజయ్ మాకిన్లు ఢిల్లీ నుంచి జైపూర్ వచ్చారు. అయితే సీఎల్పీ సమావేశానికి గెహ్లేట్ విధేయులైన ఎమ్మెల్యేలెవ్వరూ హాజరు కాలేదు.

ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండాలని గతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి, గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే, అతను రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

.

First Published:  25 Sept 2022 10:33 PM IST
Next Story