దేశంలో రోజుకు 82 హత్యలు, గంటకు 11 కిడ్నాప్‌లు!
దేశంలో రోజు రోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రోజుకు 82 మంది హత్యకు గురవుతున్నారు. సరాసరిన గంటకు 11 కన్నా ఎక్కువ కిడ్నాప్ లు జరుగుతున్నాయి.
దేశంలో ప్రజల ఆదాయాల సంగతెలా ఉన్నా ముఖ్యంగా రైతుల ఆదాయం రెట్టింపు అవడం కన్నా నేరాల సంఖ్యలో మాత్రం రెట్టింపు గణాంకాలు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి)నివేదిక వెల్లడించింది.
దేశంలో రోజురోజుకీ హత్యలు, కిడ్నాప్‌ల సంఖ్య రెట్టింపు అవుతోందని ఎన్ సి ఆర్ బి తెలిపింది. దేశవ్యాప్తంగా రోజుకు 82 మంది హత్యకు గురవుతున్నారని, సరాసరిన గంటకు 11 కన్నా ఎక్కువ కిడ్నాప్ లు జరుగుతున్నాయని తెలిపింది. జార్ఖండ్‌లో లక్ష మందిలో ఒకరు హత్యకు గురవుతున్నారు. ఢిల్లీలో కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది.
2021లో మొత్తం 29, 272 హత్యలు జరిగాయి. 2020 కన్నా 0.3 శాతం పెరిగాయి. 2020లో 29, 193 కేసులు హత్య కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. 2021లో 1,01,707 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. 2020లో 84, 805 కేసులు వచ్చాయి. అంటే 19.9 శాతం కేసులు పెరిగాయి. ఆ ఏడాది లక్ష మందిని కాపాడాగలిగారని ఎన్‌సిఆర్‌బీ పేర్కొంది.
హత్యకేసులు అధికంగా జరిగిన మొదటి ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 3,717 కేసుల్లో 3,825 మంది చనిపోగా, బీహార్ లో2,799 కేసుల్లో 2,826 మంది , మహారాష్ట్ర లో2,330 కేసుల్లో 2,381 మంది, మధ్యప్రదేశ్ లో2,034 కేసుల్లో 2075 మంది , పశ్చిమ బెంగాల్ లో1,884 కేసులలో 1,919 మంది చనిపోయారని ఆనివేదిక పేర్కొంది. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఢిల్లీలో 459 కేసులు నమోదవగా వీటిలో 478 మంది హత్యకు గురయ్యారు.
హత్యల విషయంలో లక్ష మందికి జార్ఖండ్‌లో 1573 కేసులు, అండమాన్ నికోబార్ దీవుల్లో 16 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో హత్యలకు సంబంధించి నేరాల రేటు 2.2 శాతంగా ఉంది. కిడ్నాప్ గురయిన కేసుల్లో 17,605 మంది పురుషులు, 86,543 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది