రిజర్వ్ బ్యాంకు దగ్గర 8లక్షల 12 వేల కిలోల బంగారం
విదేశీ మారక నిల్వల (ఫారెక్స్) విస్తరణలో భాగంగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ గతంలో ఓసారి చెప్పారు.
ఓపక్క బంగారం రేటు కొండెక్కి కూర్చుంది. తులం బంగారం కొనాలంటే కనీసం 70 వేలు చేత్లో పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దగ్గర పసిడి నిల్వలు కొండలా పెరిగిపోతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం మన ఆర్‌బీఐ దగ్గర ఈ జనవరి నెలాఖరుకు ఉన్న బంగారం 812.3 టన్నులు. అంటే అక్షరాలా 8లక్షల 12 వేల 300 కిలోలు. దీని ధర సుమారుగా 5 లక్షల 58 వేల 836 కోట్ల రూపాయలు
ఒక్క నెలలోనే 8.7 టన్నుల కొనుగోలు
బంగారం నిల్వలు పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఆర్‌బీఐ ప్రతి నెలా తన కొనుగోళ్లను పెంచుతూ పోతోంది. ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 8.7 టన్నులు (8,700 కిలోల) స్వర్ణం కొనుగోలు చేసింది.
విదేశీ మారక నిల్వల (ఫారెక్స్) విస్తరణలో భాగంగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ గతంలో ఓసారి చెప్పారు. గతంలో రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఆర్‌బీఐ బంగార నిల్వలను పెంచుతోంది.