Telugu Global
National

78 శాతం నిధులు ప్రచారానికా..? ఇదెక్కడి విపరీతం..

ఎంతమంది ఆడపిల్లలు కొత్తగా స్కూళ్లకు వచ్చారనే విషయంపై క్లారిటీ లేదు. పథకం పనితీరుపై సమీక్షించకపోగా.. దాని ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది.

78 శాతం నిధులు ప్రచారానికా..? ఇదెక్కడి విపరీతం..
X

ఏదైనా పథకానికి 100 కోట్లు కేటాయిస్తే.. అందులో 5 శాతమో, 10 శాతమో ప్రచారానికి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. కానీ ఏకంగా 78 శాతం ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేశారంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉందడు. కానీ ఎన్డీఏ సర్కారు మాత్రం అంతకంటే ఎక్కువ కూడా ఖర్చు చేసేలా ఉంది. ప్రస్తుతానికి నూటికి 78 రూపాయలను ప్రచారానికి ఖర్చు చేసి, పథకం అమలుకు ఏమీ మిగల్చకుండా విడ్డూరంగా ప్రవర్తించింది.

భేటీ బచావో - భేటీ పడావో.. దేశవ్యాప్తంగా ఆడపిల్లల చదువుకోసం ఈ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2016-19 మధ్య కాలంలో ఈ పథకం అమలు కోసం రూ.446.72 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో 78 శాతం మీడియాలో ప్రచారానికే వినియోగించారు. పోనీ దీనివల్ల ఎంతమంది ఆడపిల్లలు కొత్తగా స్కూళ్లకు వచ్చారనే విషయంపై క్లారిటీ లేదు. పథకం పనితీరుపై సమీక్షించకపోగా.. దాని ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రచారానికి చేసే ఖర్చు విషయంలో ప్రభుత్వం పునః పరిశీలన చేసుకోవాలని సూచించింది.

ప్రచారానికి వినియోగించే డబ్బుని, ఆడ పిల్లల చదువు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచించింది. ఈ మేరకు మహిళా సాధికారతపై ఏర్పాటైన కమిటీ.. ఈ పథకం అమలుకు సంబంధించి పలు సూచనలు చేసింది, తన నివేదికను లోక్‌ సభకు సమర్పించింది. ఆడ పిల్లల రక్షణ, వారి చదువుకోసం ఉద్దేశించిన ఈ పథకం అసలు లక్ష్యాలు నెరవేరలేదని కమిటీ తప్పుబట్టింది. కానీ, ఆడ పిల్లల ఉన్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతోందన్న ప్రచారం మాత్రం ఘనంగా జరిగిందని చెప్పింది. ఈ పథకం అమలును పర్యవేక్షిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని సూచించింది.

First Published:  6 Aug 2022 11:33 AM IST
Next Story