కోడలిని పెళ్లాడిన మామ.. - ఆమెకు 28.. అతనికి 70 ఏళ్లు
ఇటీవల కైలాశ్ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. పూజ నుదుట కైలాశ్ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూలదండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
కొడుకు మరణిస్తే.. కోడలికి మంచి జీవితం ప్రసాదించడం కోసం వేరొక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసిన మామగార్లను అక్కడక్కడా చూస్తున్నాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం విచిత్రం జరిగింది. కొడుకు చనిపోవడంతో కోడలిని మామగారే వివాహం చేసుకున్నాడు. ఇంతకీ వారి వయసు ఎంతనుకున్నారు.. మామగారి వయసు 70 ఏళ్లు.. కోడలి వయసు 28 ఏళ్లు. కోడలి కంటే రెండున్నర రెట్లు అధికంగా మామ వయసు ఉండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలోని నివసించే కైలాశ్ యాదవ్ అనే వ్యక్తికి నలుగురు సంతానం. అందరూ వివాహాలు చేసుకుని వేరు కాపురాలు పెట్టారు. కైలాశ్ యాదవ్ భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగా మిగిలింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కైలాశ్ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. పూజ నుదుట కైలాశ్ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూలదండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ విషయం ఆనోటా ఈనోటా బయటికి పొక్కి వైరల్‌గా మారింది.