Telugu Global
National

భార‌త్ త‌యారీ ద‌గ్గు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి !

భారత దేశంలో తయారైన ఓ దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ మందు హర్యాణలో తయారవుతున్నది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు ఒక హెచ్చ‌రిక జారీ చేసింది.

భార‌త్ త‌యారీ ద‌గ్గు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి !
X

పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో ద‌గ్గు మందు (కాఫ్ సిర‌ప్‌) తాగి 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సిర‌ప్ ను భార‌త్, హ‌ర్యానాలోని సోనెప‌ట్ లోగ‌ల మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసినట్టు తెలిసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం నాడు ఒక హెచ్చ‌రిక జారీ చేసింది.

మైడెన్ ఫార్మాస్యూటికల్స్ త‌యారు చేసిన ద‌గ్గు మందు వ‌ల్ల తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపింది. వీటివల్ల కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, తీవ్రమైన కిడ్నీ గాయాలతో మరణం సంభవించొచ్చు''అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈ సిర‌ప్ 66 మంది పిల్లల మరణాలకు కారణమయ్యింద‌ని డ‌బ్ల్యుహెచ్ఓ పేర్కొంది. ఈ కంపెనీ పై భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) విచార‌ణ జ‌రుపుతోంది.

శాంపిల్స్ ను ప్రయోగశాలలో జ‌రిపిన విశ్లేషణలో .. వాటిలో కలుషితాలుగా డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ ఆమోదం కాని స్జాయిలో ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయింది" అని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ తెలిపింది. డ‌బ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కలుషితమైన ఉత్పత్తులు ఇప్పటివరకు గాంబియాలో మాత్రమే కనుగొన్న‌ప్పటికీ, అవి ఇతర దేశాలకు కూడా పంపిణీ చేసి ఉండవచ్చు, "అని అన్నారు.

మెయిడన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఈ నాలుగు కాఫ్ సిరప్ లపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి

First Published:  6 Oct 2022 12:45 PM IST
Next Story