24 గంటల్లో 5,335 కరోనా పాజిటీవ్ కేసులు... 195 రోజుల్లో ఇదే అత్యధికం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.06 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది.
మనదేశంలో 24 గంటల్లో 5,335 తాజా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఈ 195 రోజులలో అత్యధికం, క్రియాశీల కేసులు 25,587 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
ఈ రోజు ఉదయం 8 గంటలకు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 24 గంటల్లో 13 మంది మరణించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.32 శాతంగా నమోదైంది. మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,39,054).
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.06 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది.
వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,82,538కి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు.