Telugu Global
National

41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అన్ని విమానాశ్రయాలకూ ఒకే తరహాలో ఈ మెసేజ్‌లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
X

దేశంలోని 41 విమానాశ్రయాలకు మంగళవారం ఒక్కరోజే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్‌ ద్వారా ఈ బెదిరింపులు రావడం గమనార్హం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది.. పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఆ తర్వాత అవన్నీ నకిలీ బెదిరింపులుగా తేల్చింది. చెన్నై– దుబాయ్‌ విమానానికీ బాంబు బెదిరింపు రాగా.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన సిబ్బంది.. అది ఫేక్‌ మెసేజ్‌ అని తేల్చారు. తర్వాత ఆ విమానం కాస్త ఆలస్యంగా దుబాయ్‌కి బయలుదేరి వెళ్లింది. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అన్ని విమానాశ్రయాలకూ ఒకే తరహాలో ఈ మెసేజ్‌లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

బాంబు బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న అధికారులు వెంటనే సైబర్‌ క్రైమ్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. బెదిరింపు మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని, త్వరలో బాంబులు పేలుతాయని, అందరూ చనిపోతారని పేర్కొంటూ ఈ మెసేజ్‌లు దాదాపు ఒకే తరహాలో వచ్చాయని అధికారులు గుర్తించారు. అంతేకాదు.. ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్‌ బృందం ఈ నకిలీ బెదిరింపుల వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మే ఒకటో తేదీన సైతం ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలలకు ఈ గ్రూపు ఇదే తరహా మెయిల్స్‌ పంపినట్టు అధికారులు చెబుతున్నారు.

First Published:  19 Jun 2024 10:40 AM IST
Next Story