Telugu Global
National

ఒకే సిరంజ్ తో 39 మంది పిల్లలకు వాక్సిన్ -వాక్సినేటర్ అరెస్ట్

మధ్యప్రదెశ్ లో అధికారుల నిర్లక్ష్యం కలకలం సృష్టిస్తోంది. ఓ పాఠశాలలో వాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా ఒకే సిరంజితో 39 మంది పిల్లలకు వాక్సిన్ ఇచ్చారు.

ఒకే సిరంజ్ తో 39 మంది పిల్లలకు వాక్సిన్ -వాక్సినేటర్ అరెస్ట్
X

ఒకే సిరంజ్ తో 39 మంది పిల్లలకు వాక్సిన్ వేసిన సంఘటన కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

నగరంలోని జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా జితేంద్ర అహిర్వార్ అనే వాక్సినేటర్ ఆ స్కూలు పిల్లలకు ఒకే సిరంజి ఉపయోగించి వాక్సిన్ వేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా టీకా అధికారి డాక్టర్ శోభరామ్ రోషన్‌ను సస్పెండ్ చేసినట్టు అధికారులు గురువారం తెలిపారు. అంతేకాక ఈ సంఘటనకు కారణమైన వ్యాక్సినేటర్ జితేంద్ర అహిర్వార్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి,అతడిని అరెస్టు చేశారు.

అయితే తన డిపార్ట్ మెంట్ హెడ్ తనకు ఈ ఆదేశాలిచ్చారని జితేంద్ర అహిర్వార్ ఓ వీడియోలో చెప్పాడు. సిరంజీల కొరత ఉన్నందున ఒకే సిరంజి ఉపయోగించి అందరికీ వాక్సిన్ లు వేయమని తమ హెడ్ చెప్పినట్టు ఆయన తెలిపారు.

ఈ 39 మంది పిల్లలు 9వ తరగతి నుండి 12 వ తర‌గతి వరకు చదువుతున్నారు. దాదాపు అందరి వయసు 15 నుండి 17 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వారందరిని వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంచామని అందరి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు.

First Published:  29 July 2022 7:47 AM IST
Next Story