Telugu Global
National

ఉత్తరాఖండ్ లోయలో ప‌డిన పెండ్లివారి బస్సు..32 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో 32 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థ‌లిలో ఎస్ డిఆర్ ఎఫ్ (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) బ‌ల‌గాలు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

ఉత్తరాఖండ్ లోయలో ప‌డిన పెండ్లివారి బస్సు..32 మంది దుర్మ‌ర‌ణం
X

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో గత రాత్రి పెండ్లి బృందంతోవెళుతున్న ఓ బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డంతో 32 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.20 మందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ప్ర‌యాణ స‌మ‌యంలో బ‌స్సులో సుమారు 50 మంది ఉన్నార‌ని చెబుతున్నారు. సిమ్డి గ్రామ సమీపంలో జ‌రిగిన ప్రమాద స్థ‌లిలో ఎస్ డిఆర్ ఎఫ్ (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) బ‌ల‌గాలు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ ఆపరేషన్ లో 21 మంది ప్రయాణికులను రక్షించ‌గ‌లిగారు.

"ధూమాకోట్‌లోని బీరోఖల్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన పౌరీ గర్వాల్ బస్సు ప్రమాదంలో 32 మంది మరణించారు. పోలీసులు మరియు ఎస్‌డిఆర్ ఎఫ్ 21 మందిని రక్షించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు చేర్చారు" అని రాష్ట్ర పోలీసు చీఫ్ అశోక్ కుమార్ తెలిపారు. లాల్‌ధంగ్ ప్రాంతం నుండి వివాహ ఊరేగింపు బయలుదేరినట్లు హరిద్వార్ సిటీ ఎస్పీ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు.

First Published:  5 Oct 2022 1:22 PM IST
Next Story