దుర్గా పూజ సమయంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 60 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ భదోహిలోని దుర్గాపూజ మండపంలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించగా, 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో దుర్గాపూజ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించగా 60 మందికి పైగా గాయాలపాలయ్యారు.
భదోహిలోని దుర్గాపూజ మండపంలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. 60 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
రాత్రి 9 గంటల ప్రాంతంలో మండపం వద్ద హారతి నిర్వహిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ అగ్నిప్రమాదంలో 45 ఏళ్ల మహిళ, 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించగా, ఈ ఉదయం 10 ఏళ్ల బాలుడు ఆసుపత్రిలో మరణించాడని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు.
.
"ఆర్తి' (ప్రార్థనలు) సమయంలో ఈ సంఘటన జరిగింది, అది పీక్ టైమ్. మండపం లోపల దాదాపు 150 మంది ఉన్నారు. నిప్పంటుకొని గాయాలపాలైన బాధితులను సూర్య ట్రామా సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, గోపిగంజ్, ఆనంద్ ఆసుపత్రికి తరలించారు, "అని పోలీసు అధికారి తెలిపారు.