Telugu Global
National

శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడంటే!

మధ్యప్రదేశ్‌లో అరుధైన ఘటన జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకోవడం ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడంటే!
X

మధ్యప్రదేశ్‌లో అరుధైన ఘటన జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకోవడం ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గ్వాలియర్‌లోని న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివానీ పరిహార్‌కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరిగేకొద్దీ ఆయన్నే ఆరాధిస్తూ వచ్చిన శివానీ.. పెళ్లి కూడా కృష్ణుణ్నే చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులను సైతం ఒప్పించి తను ఆరాధించే శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది.

శివానీ వివాహం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. వధువు శ్రీకృష్ణుడి విగ్రహంతో బృందావన్‌ నుంచి బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చింది. స్థానిక మందిరంలో వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. అనంతరం శివానీకి మ్యారేజీ సర్టిఫికేట్‌ కూడా వచ్చింది.

పెళ్లి తర్వాత శ్రీ కృష్ణుడి విగ్రహంతో బృందావనానికి బయలుదేరింది శివానీ. తన తదుపరి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్‌ ఆశ్రమంలో శ్రీ కృష్ణుని సేవలో ఆమె గడపనుంది. పెళ్లి విషయంలో తాము మొదట్లో సంశయించినా, శివానీ పట్టుదల చూసి అంగీకరించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

First Published:  20 April 2024 12:16 PM IST
Next Story