Telugu Global
National

మణిపూర్‌కు నిజనిర్ధారణ కమిటీ.. 20 మంది ఎంపీల బృందాన్ని ప్రకటించిన 'ఇండియా'

మణిపూర్ హింసపై చర్చకు అనుమతించక పోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ప్రారంభమైన రోజు నుంచి ప్రతిపక్షాలు ఇదే అంశంపై ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నాయి.

మణిపూర్‌కు నిజనిర్ధారణ కమిటీ.. 20 మంది ఎంపీల బృందాన్ని ప్రకటించిన ఇండియా
X

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఈ ఏడాది మే 3 నుంచి రెండు తెగల మధ్య హింసాకాండ జరుగుతోంది. మైదాన ప్రాంతానికి చెందిన మైతేయ్‌లకు ఎస్టీ హోదా కల్పించడంపై అక్కడి కూకీలు ఆందోళన బాటపట్టారు. చివరకు ఇరు వర్గాల మధ్య గొడవ రాష్ట్రం తగలబడిపోయే వరకు వచ్చింది. కూకీల మహిళలపై చేస్తున్న దారుణాలు వెలుగులోకి రావడంతో దేశంతో పాటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. మణిపూర్‌లో హింస చేలరేగిన 79 రోజుల తర్వాత గానీ పీఎం నరేంద్ర మోడీ స్పందించలేదు.

ఇక పార్లమెంటులో కూడా మణిపూర్ అంశమే కీలకంగా మారింది. అక్కడ జరుగుతున్న హింసపై పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. శుక్రవారం కూడా ఈ విషయంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. మణిపూర్ హింసపై చర్చకు అనుమతించక పోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ప్రారంభమైన రోజు నుంచి ప్రతిపక్షాలు ఇదే అంశంపై ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కీలక నిర్ణయం తీసుకున్నది.

ఈ నెల 29, 30న మణిపూర్‌కు ఒక నిజనిర్ధారణ కమిటీని పంపాలని నిర్ణయించింది. ఇందుకు ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలను ఎంపిక చేసింది. ఈ బృందం రెండు రోజుల పాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించనున్నది. మైదాన ప్రాంతంతో పాటు పర్వత, లోయ ప్రాంతాల్లో కూడా ఈ నిజ నిర్ధారణ బృందం పర్యటిస్తుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులతో భేటీ కానున్నది. అలాగే పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను బృందం తెలుసుకుంటుంది.

ఇండియా ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు..

1. అధిర్ రంజన్ చౌదరి - కాంగ్రెస్

2. గౌరవ్ గొగొయ్ - కాంగ్రెస్

3. రాజీవ్ రంజన్ (లలన్ సింగ్) - జనతాదళ్ (యూ)

4. సుస్మితా దేవ్ - తృణమూల్ కాంగ్రెస్

5. కణిమొళి కరుణానిధి - డీఎంకే

6. సందోశ్ కుమార్ - సీపీఐ

7. ఏఏ రహీమ్ - సీపీఎం

8. ప్రొఫెసర్. మనోజ్ కుమార్ ఝా - ఆర్జేడీ

9. జావేద్ అలీ ఖాన్ - సమాజ్ వాది పార్టీ

10. మహువా మజీ - జార్ఖండ్ ముక్తి మోర్చ

11. పిపి. మహ్మద్ ఫైజల్ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

12. అనీల్ ప్రసాద్ హేగ్డే - జనతాదళ్ (యూ)

13. ఈటీ. మహ్మద్ బషీర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

14. ఎన్‌కే. ప్రేమ చంద్రన్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ

15. సుశీల్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ

16. అరవింద్ సావంత్, శివసేన

17. డి. రవికుమార్, విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)

18. తిరు తోల్ తరుమవలవన్, వీసీకే

19. జయంత్ సింగ్, రాష్ట్రీయ లోక్ దళ్

20. ఫులో దేవి నేతమ్, కాంగ్రెస్

First Published:  28 July 2023 1:12 PM GMT
Next Story