ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
ఘటనలో సుమారు 18మంది మరణించారు. మరణించిన వారిలో 17మంది మహిళలతో పాటు డ్రైవర్ ఉన్నాడు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో ఏకంగా 18మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8మందికి తీవ్ర గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుక్డూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పాని గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే ..
తునికి ఆకు సేకరణకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజనుల వాహనం అదుపుతప్పి 20 అడుగుల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 18మంది మరణించారు. మరణించిన వారిలో 17మంది మహిళలతో పాటు డ్రైవర్ ఉన్నాడు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు కవార్ధా ఎస్పీ తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ పరీక్షల కోసం పంపించారు.
ప్రమాదం జరిగే సమయానికి వ్యాన్‌లో సుమారు 40మంది వరకు ప్రయాణికులున్నారు. కార్మికుల మృతిపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలందరికీ సానుభూతి తెలిపారు. ఇప్పటికే స్థానిక యంత్రాంగం సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.