16మంది స్కూలు పిల్లలు దుర్మరణం.. అసలేం జరిగిందంటే..
బోటింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. పడవలో ఎవరికీ లైఫ్ జాకెట్ ఇవ్వలేదు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించారు.
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదరలోని హరిణి సరస్సులో పడవ బోల్తా పడటంతో 16 మంది స్కూళ్లు పిల్లలతో పాటు ఇద్దరు టీచర్లు చనిపోయారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు సమాచారం. వడోదరలోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లింది. 27 మంది విద్యార్థులతో పడవ వెళ్తోంది. పిల్లలంతా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే పడవ ఒక్కసారిగా తిరగబడింది. దీంతో 16 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిలో కొంత మందిని బోటింగ్ సిబ్బంది రక్షించారు. మిగతావారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బోటింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. పడవలో ఎవరికీ లైఫ్ జాకెట్ ఇవ్వలేదు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విహారయాత్ర కాస్త విషాదంగా మారడంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.