Telugu Global
National

ఉజ్జ‌యిని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యంలో అగ్నిప్రమాదం.. 13 మందికి తీవ్ర‌గాయాలు

ఉజ్జ‌యినిలో ఆలయ గర్భగుడి గోడలు, పైకప్పుకు వెండి తాపడం ఉంది. ప్రతి సంవత్సరం హోలీ నాడు బాబా మహాకాల్‌కి ధూలెండి సమర్పిస్తారు. ఈ ఏడాది గర్భగుడి గోడలకు రంగు అంటుకోకుండా శివలింగంపై ప్లాస్టిక్ రేకులు వేశారు.

ఉజ్జ‌యిని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యంలో అగ్నిప్రమాదం.. 13 మందికి తీవ్ర‌గాయాలు
X

జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒక‌టైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, గర్భగుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు పూజారులు, 8 మంది భక్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారంద‌రినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉజ్జ‌యినిలో ఆలయ గర్భగుడి గోడలు, పైకప్పుకు వెండి తాపడం ఉంది. ప్రతి సంవత్సరం హోలీ నాడు బాబా మహాకాల్‌కి ధూలెండి సమర్పిస్తారు. ఈ ఏడాది గర్భగుడి గోడలకు రంగు అంటుకోకుండా శివలింగంపై ప్లాస్టిక్ రేకులు వేశారు. సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో మహాకాల్‌కి గులాల్‌ సమర్పిస్తున్నప్పుడు హారతి పళ్లెంలో మండుతున్న కర్పూరంపై ధూలెండి పడి మంటలు చెలరేగాయి. ధూలెండి కారణంగా గర్భగుడిలో ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో శివలింగంపై ఉన్న రేకులు కూడా మంటలు వ్యాపించాయి. వాటిని వెంట‌నే అదుపులోకి తెచ్చారు.

గర్భగుడిలో ఉన్న రసాయనాలతో కూడిన రంగుల తాకిడికి మంటలు మరింతగా వ్యాపించాయి. దీంతో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని పూజారి ఆశిష్ చెప్పారు.ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, ఆలయం వద్ద ఉన్న భక్తులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్ప‌త్రికి తరలించారు. ‘గర్భగృహ’లో భస్మ హారతి సందర్భంగా మంటలు చెలరేగాయ‌ని, గాయ‌ప‌డిన 13 మందికి చికిత్స చేయిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

First Published:  25 March 2024 3:34 PM IST
Next Story