Telugu Global
National

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది మృతి

ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక‌క్కడే మరణించారు. స్థానికులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగు నెలల చిన్నారి సహా 12 మంది మృతి
X

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సు, కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది అక్కడిక‌క్కడే మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో 23 మంది గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న జరిగిన సమయంలో ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని వైజాపూర్ ప్రాంతంలో సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేపై వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు మినీ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. నాసిక్ జిల్లాలోని ఇందిరానగర్ కు చెందిన యాత్రికులు బుల్దానాలోని సైలానీ బాబా దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం అర్ధరాత్రి సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఉన్న జంబూర్ టోల్ సమీపంలో ఆర్డీఓ పలు వాహానాలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే యాత్రికులతో వేగంగా వస్తున్న మినీ బ‌స్సు అదుపుత‌ప్పి కంటైన‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి, డ్రైవర్ సహా బస్సులోని 12 మంది అక్కడిక‌క్కడే మరణించారు. స్థానికులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఘాటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 ప్రయాణికులు ఉన్నారని, మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 800 ప్రమాదాలు జరిగినట్లు అధికారిక సమాచారం. రోడ్డు ప్రమాదాలపై ఇటీవల స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వింతైన వ్యాఖ్యలు చేశారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయని.. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయితే కారణం ఏదైనా సరే.. ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉందన్నారు.

First Published:  15 Oct 2023 11:41 AM IST
Next Story