Telugu Global
International

హూతీలపై అమెరికా ప్రతీకార దాడులు

టెల్‌అవీవ్‌పై హూతీలు దాడులు చేసిన కొన్నిగంటల్లోనే అమెరికా ప్రతీకార దాడులు చేయడం విశేషం

హూతీలపై అమెరికా ప్రతీకార దాడులు
X

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ ల మద్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా విస్తరిస్తున్నది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. శనివారం హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులు ప్రయోగించిన విషయం విదితమే. అయితే దీనికి అమెరికా ప్రతీకార దాడులు చేసింది. యెమెన్‌ రాజధానిలో హూతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం పేర్కొన్నది. హూతీ కార్యకలాపాలు దెబ్బతినేలా దాడులు నిర్వహించాం. ఎర్ర సముద్రం, బాబ్‌ అల్‌ మాండెబ్‌, ఏడెన్‌ గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై దాడులు చేశాం. దీంతో హూతీల కార్యకలాపలకు ఆటంకం కలిగించడమే దీని లక్ష్యమని అమెరికా మిలటరీ అధికారులు తెలిపారు.

మరోవైపు గత గురువారం యెమెన్‌పై ఇజ్రాయెల్‌ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడులు హూతీల సైనిక స్థావరాల లక్ష్యంగా జరిపినట్లు ఇజ్రాయెల్‌ దళాలు తెలిపాయి. దీనికి ప్రతీకారంగా శనివారం ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌పై ప్రొజక్టెల్‌ క్షిపణులను ప్రయోగించాయి. వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ సైన్యం విఫలమైంది. పలితంగా 16 మందికి గాయాలయ్యాయి. రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంపై టెల్‌అవీవ్‌ విచారణకు ఆదేశించింది. టెల్‌అవీవ్‌పై హూతీలు దాడులు చేసిన కొన్నిగంటల్లోనే అమెరికా ప్రతీకార దాడులు చేయడం విశేషం.

గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హూతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్‌ మద్దతు ఇస్తున్నది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొంటున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపేవరకు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో హూతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ మిలిటరీ దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి.

First Published:  22 Dec 2024 9:35 AM IST
Next Story