Telugu Global
International

ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపేసిన ట్రంప్‌

ఖనిజాల ఒప్పందంపై వైట్‌హౌస్‌లో ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య వాడీవేడి చర్చ.. కుదరని ఏకాభిప్రాయం.. అందుకే సాయం నిలిపివేత

ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపేసిన ట్రంప్‌
X

ఉక్రెయిన్‌కు అమెరికా మిలటరీ సహాయం నిలిపివేసింది. రష్యాతో యుద్ధానికి తాము అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్‌ శాంతిస్థాపనపై దృష్టి సారించారని, తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని వైట్‌హౌస్‌ ప్రతినిధి తెలిపారు. అందుకే సైనిక సాయాన్ని నిలిపివేశామని ఇదే పరిష్కారాన్ని చూపిస్తుందని వెల్లడించారు. సైనిక సాయం నిలిపివేత తాత్కాలికమేనని వెల్లడించారు. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తేవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి తెరదించడం శాంతి ఒప్పందం కుదర్చడం బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి కీవ్‌ అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ గత వారం వైట్‌ హౌస్‌కు వెళ్లారు. భవిష్యత్తులో రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తామని గ్యారెంటీ ఇవ్వాలని జెలెన్‌స్కీ ట్రంప్‌పై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రెండు దేశాధినేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

First Published:  4 March 2025 11:02 AM IST
Next Story