Telugu Global
International

భారత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపిన ట్రంప్‌

అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటలోనే మార్కో రూబియో ప్రపథమంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ

భారత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపిన ట్రంప్‌
X

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపారు. అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటలోనే మార్కో రూబియో ప్రపథమంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారత్‌ తరఫున హాజరైన జై శంకర్‌ మార్క్‌ రూబియోతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేవిధంగా ఇరువురు చర్చలు జరిపారు.

ఇక ఈ భేటీకి ముందు జైశంకర్‌.. క్వాడ్‌ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత ఈ తొలి క్వాడ్‌ భేటీలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపనాన్‌ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిభద్రతలు, స్వేచ్ఛాయుత సహకారం వంటి అంశాలపై నాలుగు దేశాల మంత్రులు చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి తీసుకునే ఏకపక్ష చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామనంటూ క్వాడ్‌ కూటమి చైనాను పరోక్షంగా హెచ్చరించింది.

First Published:  22 Jan 2025 2:08 PM IST
Next Story