Telugu Global
International

పాక్‌ పై ప్రతీకార దాడులకు తాలిబాన్‌ల వ్యూహ రచన

సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరింపు

పాక్‌ పై ప్రతీకార దాడులకు తాలిబాన్‌ల వ్యూహ రచన
X

పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులకు తాలిబాన్లు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌ పై పాక్‌ వైమానిక దాడులు చేసింది. దీంతో పాక్‌ కు దీటైన జావాబు చెప్పే ప్రయత్నాల్లో తాలిబాన్లు ఉన్నారు. సుమారు 15 వేల మంది తాలిబాన్లు పాక్‌, అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో మోహరించారని స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. వాళ్లందరూ కాబుల్‌, కాందహార్‌, హెరాత్‌ నుంచి పాక్ సరిహద్దుల్లోని ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ వైపునకు వెళ్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. పాక్‌ వైమానిక దాడుల్లో 46 మంది అఫ్ఘాన్‌ పౌరులు మృతిచెందారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలి పెట్టబోమని తాలిబాన్లు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ పై మెరుపు దాడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

First Published:  26 Dec 2024 7:56 PM IST
Next Story