Telugu Global
International

అణు ముసాయాదాకు సవరణలు చేసిన రష్యా

ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతున్నవేళ నాటో దేశాలకు పుతిన్‌ హెచ్చరిక

అణు ముసాయాదాకు సవరణలు చేసిన రష్యా
X

ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతున్న సమయంలో నాటో దేశాలకు రష్యా తీవ్ర హెచ్చరిక చేసింది. తన అణు ముసాయాదాకు సవరణలు చేసింది. తాజా మార్పుల ప్రకారం రష్యా దేశంపై మరో దేశం అణ్వాయుధాలు కలిగిన దేశం మద్దతు ఇచ్చినప్పుడు దురాక్రమణలో దానిని కూడా భాగస్వామిగా పరిగణించనున్నట్లు పుతిన్‌ తెలిపారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంపై అణు సామర్థ్యం లేని దేశం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని తెలిపారు. అలాంటి దాడులకు ప్రతిగా అణ్వాయుధాలు ప్రయోగిస్తారా? అన్నదానికి పుతిన్‌ వెల్లడించలేదు. పుతిన్‌ హెచ్చరిక తర్వాత రష్యా తన అణు ముసాదాలో సవరణలు చేసింది. పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్నయుద్ధంలో నాటో కూడా చేరినట్లు అవుతుందని పుతిన్‌ పేర్కొన్నారు.

First Published:  26 Sept 2024 3:13 AM GMT
Next Story