Telugu Global
International

మోడీ సర్కార్ పద్దతి అల్పత్వం, చిల్లరతనం‍...పులిట్జర్ ప్రైజ్ నిర్వాహకుల మండిపాటు

అత్యంత ప్రతిష్టాకరమైన పులిట్జర్ అవార్డును పొందిన కశ్మీర్ కు చెందిన ఫోటో జర్నలిస్టు సనా ఇర్షాద్ మట్టూను ఆ అవార్డు అందుకోవడానికి వెళ్ళకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంది. దీనిపై పులిట్జర్ అవార్డు నిర్వాహకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది భారత ప్రభుత్వపు అల్పత్వం, చిల్లరతనం‍ అని వారు వ్యాఖ్యానించారు.

మోడీ సర్కార్ పద్దతి అల్పత్వం, చిల్లరతనం‍...పులిట్జర్ ప్రైజ్ నిర్వాహకుల మండిపాటు
X

పులిట్జర్ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్తున్న కాశ్మీరీ ఫోటో జర్నలిస్టు సనాను మోడీ సర్కార్ అడ్డుకోవడం పై పులిట్జర్ అవార్డు నిర్వాహకులు మండిపడ్డారు.

పులిట్జర్ ప్రైజెస్ నిర్వహణ కమిటీ కో-చైర్ పర్సన్ జాన్ డానిస్జెవ్స్కీ అక్టోబర్ 20 న న్యూయార్క్‌లో జరిగిన అవార్డు వేడుకలో మాట్లాడుతూ... అవార్డు-విజేత కాశ్మీరీ అయిన సనా ఇర్షాద్ మట్టూను ఈవెంట్ కు రాకుండా అడ్డుకోవడం అత్యంత వివక్షతో కూడుకున్నది" అని పేర్కొన్నారు.

అక్టోబరు 18న న్యూ ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో సనాను ఆపేశారు. తన‌ వద్ద వీసా,టికెట్, అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ వెళ్ళకుండా ఆపారని ఫోటో జర్నలిస్ట్ సనా ఆరోపించారు.

హ్యూమన్ రైట్స్ వాచ్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ , ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాతో సహా గ్లోబల్, నేషనల్ రైట్స్, జర్నలిస్టుల సంస్థలు సనాను అమెరికా వెళ్ళకుండా ఆపడాన్ని తీవ్రంగా ఖండించాయి. చెప్పింది.

పులిట్జర్ బహుమతుల ప్రధానోత్సవానికి సనా రాలేకపోవడంపై పులిట్జర్ ప్రైజెస్ నిర్వహణ కమిటీ కో-చైర్ పర్సన్ జాన్ డానిస్జెవ్స్కీ చేసిన వ్యాఖ్యలు అధికారిక హ్యాండిల్ లో ట్వీట్ చేశారు..

"ఇది అల్పత్వం, చిల్లరతనం అత్యంత వివక్ష .. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది చిహ్నం." అని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కోవిడ్-19తో భారతదేశం చేస్తున్న పోరాటాన్ని కవరేజ్ చేసినందుకు గాను రాయిటర్స్ బృందంలో భాగంగా సనాకు ఈ అవార్డు లభించింది.

"సనా మట్టూను విదేశాలకు వెళ్లకుండా ఎందుకు నిషేధించారనే దానిపై అధికారులు ఇప్పటి వరకు అధికారిక వివరణ ఇవ్వలేదు - అయితే కాశ్మీర్‌లోని జర్నలిస్టులు, పౌర సమాజంపై భారత అధికారుల అణిచివేతకు ఇదో ఉదహరణ '' అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.

''ఆగస్టు 2019 నుండి, కశ్మీర్‌లో కనీసం 35 మంది జర్నలిస్టులు పోలీసు విచారణ, దాడులు, బెదిరింపులు, భౌతిక దాడి, ఆంక్షలు, కల్పిత క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు" అని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) ట్వీట్ చేసింది.

2022లో, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం 150వ స్థానంలో నిలిచింది. స్వాతంత్య్ర భారత చ‌రిత్రలో 2022 దే అత్యల్ప ర్యాంక్ .

First Published:  22 Oct 2022 3:50 PM IST
Next Story