Telugu Global
International

లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు..జోబైడెన్‌ కుమారుడి ఇల్లు కూడా దగ్ధం

మొత్తం ఆరుచోట్ల వ్యాపించిన కార్చిచ్చులు,50 బిలియన్‌ డాలర్ల (రూ. 4.2 లక్షల కోట్ల) సంపద కాలి బూడిందైని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడి.

లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు..జోబైడెన్‌ కుమారుడి ఇల్లు కూడా దగ్ధం
X

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌ కుమారుడి ఇల్లు కూడా కాలి బూడిదైనట్లు సమాచారం.

మాలిబులో జోబైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ఇల్లు ఉన్నది. ఈ మంటల్లో అది కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ మీడియాలో ఈ మేరకు కథనాలు వెల్లడించాయి. ఇంటిముందు ఉంచిన కారు కూడా కాలిపోయిందని రష్యన్‌ టెలివిజన్‌ తెలిపింది. ఈ విషయంపై తనకు సరైన సమాచారం లేదని జో బైడెన్‌ విలేకరులతో పేర్కొన్నారు. మూడు రూమ్‌లు కలిగిన ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు గురువారం హాలీవుడ్‌ హిల్స్‌కు వ్యాపించింది. మొత్తంగా 2,00 నిర్మాణాలు దగ్ధమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం ఆరుచోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. 50 బిలియన్‌ డాలర్ల (రూ. 4.2 లక్షల కోట్ల) సంపద కాలి బూడిందైని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 1700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా సిద్ధం చేసింది.

First Published:  9 Jan 2025 1:31 PM IST
Next Story