Telugu Global
International

హిజ్బుల్లా నూతన చీఫ్‌గా షేక్ నయీం ఖాసీమ్

ఇరాన్ మద్దతు గల లెబ‌నాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా కొత్త నేత‌ను ప్ర‌క‌టించింది.

హిజ్బుల్లా నూతన చీఫ్‌గా షేక్  నయీం ఖాసీమ్
X

ఇరాన్ మద్దతు గల లెబ‌నాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లా కొత్త నేత‌ను ప్ర‌క‌టించింది.షేక్ న‌యిమ్ కాస్సెమ్ ఆ సంస్థ నూతన అధినేత‌గా భాద్యతలు తీసుకోనున్నారు. ఇటీవ‌ల ఇజ్రాయిల్ జ‌రిపిన దాడిలో హిజ్‌బొల్లా నేత హ‌స‌న్ న‌స్ర‌ల్లా మృతి చెందటంతో ఆయన స్ధానంలో నయిమ్‌ను నియమించారు. న‌యిమ్ కాస్సెమ్ ఇప్పటి వరుకు హిజ్‌బొల్లా చీఫ్‌గా కొనసాగారు. సుమారు మూడు ద‌శాబ్ధాల పాటు న‌స్ర‌ల్లాకు డిప్యూటీగా కాస్సెమ్ చేశారు. విజ‌యం సాధించే వ‌ర‌కు న‌స్ర‌ల్లా పాల‌సీల‌తో పోరాడ‌నున్న‌ట్లు హిజ్‌బొల్లా కొత్త నేత తెలిపారు. మ‌రో వైపు ఇజ్రాయిల్ నిర్వ‌హించిన దాడిలో.. 60 మంది మృతిచెందారు.

ఓ అయిదు అంత‌స్తుల భ‌వనంపై అటాక్ జ‌రిగింది. దాంట్లో నార్త్ గాజాకు చెందిన పాల‌స్తీనియ‌న్లు ఉంటున్నారు. మృతిచెందిన వారిలో స‌గం మంది మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. నయీం ఖాసీమ్1953లో లెబనాన్‌లోని కాఫర్ కిలా గ్రామంలో జన్మించారు.1970లో లెబనాన్‌లోని షియా అమల్ ఉద్యమంలో ఆయన భాగమయ్యాడు. అనంతరం 1980లో హిజ్బుల్లా మూమెంట్‌లో పాల్గొన్న ఖాసీమ్ ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. 1991లో హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ అయ్యాడు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆయనే హిజ్బుల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హిజ్బుల్లా అధినేతగా ఎన్నికయ్యారు.

First Published:  29 Oct 2024 8:23 PM IST
Next Story