Telugu Global
International

ఇస్లామాబాద్‌ లాక్‌ డౌన్‌!

ఇమ్రాన్‌ ఖాన్‌ విడుదల కోసం ఆందోళన.. కఠిన ఆంక్షలు పెట్టిన సర్కార్‌

ఇస్లామాబాద్‌ లాక్‌ డౌన్‌!
X

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ లో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టారు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా కరోనా (కోవిడ్) తీవ్రత లేదు.. అలాంటప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ ఎందుకు అనుకుంటున్నారా? ఇదేదో ఫేక్‌ న్యూస్‌ అని అనుమానిస్తున్నారా? ఎంతమాత్రం కానేకాదు. ఇస్లామాబాద్‌ లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. ఎవరూ బయట కనిపించొద్దని కఠిన ఆంక్షలు పెట్టారు. కానీ కారణం మాత్రం కోవిడ్‌ వైరస్‌ కాదు.. రాజకీయ కారణాలతో ఇస్లామాబాద్‌ లో లాక్‌డౌన్‌ పెట్టారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్‌ తెహ్రీక్‌ -ఏ - ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ నాయకులు, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఇస్లామాబాద్‌ లోని రెడ్‌ జోన్‌ లో గల డీ చౌక్‌ ఎంట్రన్స్‌ దగ్గర నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఖైబర్‌ పంఖ్తుంక్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ పిలుపునిచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ను విడుదల చేసే వరకు డీ చౌక్‌ లోనే నిరసన తెలుపుదామని వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. పోలీసులు ఇస్లామాబాద్‌ కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్‌ చేశారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లు జరుగుతాయనే అనుమానంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. మొబైల్‌ ఫోన్‌ల సేవలను నిలుపుదల చేశారు. జనాలు గుమిగూడవద్దని, వాట్సప్‌ సేవలపైనా ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

First Published:  24 Nov 2024 6:02 PM IST
Next Story