కమలా హారిస్ తన పోరాటాన్ని కొనసాగిస్తారు
రానున్న తరాలకు మార్గదర్శిగా నిలుస్తారని బైడెన్ ఆశాభావం
BY Raju Asari7 Nov 2024 11:09 AM IST
X
Raju Asari Updated On: 7 Nov 2024 11:09 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఓటమిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. అసాధారణ పరిస్థితుల్లో ఆమె డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వచ్చి నాయకత్వ పటిమను చూపారని అన్నారు. ఆమెపై ఎంతో నమ్మకం కారణంగానే 2020లో ఉపాధ్యాక్షురాలి అభ్యర్థిగా ఎంచుకున్నట్లు.. అది తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయమని తెలిపారు. కమలా హారిస్ తన లక్ష్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తారని.. రానున్న తరాలకు మార్గదర్శిగా నిలుస్తారని బైడెన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Next Story