అమెరికా అధ్యక్ష పదవి రేసులో మరో ప్రవాస భారతీయుడు
హర్షవర్ధన్ సింగ్ తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
BY Telugu Global30 July 2023 8:11 AM IST
X
Telugu Global Updated On: 30 July 2023 8:11 AM IST
అమెరికా అధ్యక్ష పదవి రేసులో మరో ప్రవాస భారతీయుడు నిలిచాడు. ఇంజినీర్ అయిన హర్షవర్ధన్ సింగ్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయదలచుకున్నట్టు గురువారం ప్రకటించాడు. ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు... నిక్కీ హేలీ (51), వివేక్ రామస్వామి (37) ఈ బరిలో ఉండటం గమనార్హం. ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా హర్షవర్ధన్ సింగ్ తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఈ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం దీంతో స్పష్టమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలో రిపబ్లికన్ల జాతీయ సదస్సు తేల్చుతుంది.
Next Story