భారత్-పాక్ మ్యాచ్ లో... 'కేసీఆర్ జిందాబాద్' నినాదాలు!
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో కేసీఆర్, బీఆరెస్, టీఆరెస్ జిందాబాద్ నినాదాలు మారుమోగిపోయాయి.ఆస్ట్రేలియా టీఆరెస్ సభ్యులు పెద్ద ఎత్తున క్రికెట్ గ్రౌండ్ కు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ సమయంలో కేసీఆర్ జిందాబాద్, బీఆరెస్ జిందాబాద్ నినాదాలు మారుమోగాయి. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో టీఆర్ఎస్ అభిమానులు 'దేశ్ కి నేత కేసీఆర్', 'కేసీఆర్ జిందాబాద్', బీరెస్ జిందాబాద నే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అతను కూడా టీఆరెస్ ఫ్యాన్స్ తో పాటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మషేష్ మాట్లాడుతూ... భారత్ దేశంలో రోజు రోజుకూ భారత రాష్ట్ర సమితికి మద్దతు పెరుగుతోందన్నారు. ఎన్నారైలతో పాటు దేశ ప్రజలంతా కూడా తమ కష్టాలు తీరుస్తాడనే ఆశతో కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించ బోతున్నారని మహేష్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు డా.అనిల్ రావు చీటి, వినయ్ సన్నీ గౌడ్, విక్రమ్ కందుల, నరేందర్ రెడ్డి, సాయి గుప్తా, విశ్వామిత్ర, సునీల్ రెడ్డి, సతీష్ పులిపకలతో పాటు ఇండియా నుండి విచ్చేసిన తెలంగాణ వారు అనేక మంది పాల్గొన్నారు.